అందరు అనుమానిస్తున్నట్లుగానే అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారుల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌన్ ముందే ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. ట్రంప్ మద్దతుదారలను వ్యతిరేకిస్తు బైడెన్ మద్దతుదారులు కూడా పోటీ ఆందోళనలు మొదలుపెట్టడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.
ఇద్దరు మద్దతుదారులు ఒకేచోట చేరి ఆందోళనలతో హోరెత్తించటంతో వైట్ హౌస్ చుట్టుపక్కలంతా ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. తమ చేతుల్లోని కర్రలతో ఇద్దరి మద్దతుదారులు కొట్టేసుకున్నారు. వీళ్ళని అదుపు చేయటం కోసం చివరకు పోలీసులు కూడా ఇద్దరి వీపులు మోత మోగించాల్సొచ్చింది. అయినా మద్దతుదారులు వెనక్కు తగ్గకపోవటమే విచిత్రంగా ఉంది. ఓ సందర్భంగా మద్దతుదారుల్లో కొందరు పోలీసులపై తిరగబడ్డారు. ఈ గొడవల్లో 4 మద్దతుదారులకు ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనపపై జో బైడెన్ గెలిచిన దగ్గర నుండి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఊగిపోతున్న విషయం యావత్ ప్రపంచం చూస్తున్నదే. పైగా తాను ఎన్నికల్లో ఓడిపోతే బైడెన్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగించేది కూడా లేదని ఎన్నికలకు మందు ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు చెప్పినట్లుగానే ఓడిపోయిన తర్వాత కోర్టులో కేసులు వేయించారు. అమెరికా అంతటా భారీ నిరసనలు చేయిస్తున్నారు.
అధికార మార్పిడి విషయంలో అతిగొప్ప ప్రాజస్వామ్య దేశంగా ప్రచారం చేసుకునే అమెరికాలోనే ఇటువంటి గొడవలు జరగటం, ఎన్నికల ప్రక్రియ అస్తవ్యస్ధంగా ఉండటంతో ప్రపంచం ముందు నవ్వుల పాలవుతోంది. వ్యక్తుల కన్నా వ్యవస్ధలే అమెరికాలో చాలా గొప్పవని యావత్ ప్రపంచం ఇంతవరకు అనుకునేది. ఇలాంటి దేశంలోనే ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఇటువంటి అనూహ్య ఘటనలు జరగటంతో యావత్ ప్రపంచం విస్తుపోతోంది. ప్రస్తుతం వాషింగ్టన్ కు మాత్రమే పరిమితమైన ఆందోళనలు ముందు ముందు మరిన్ని రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాల్సిందే.
This post was last modified on November 16, 2020 3:59 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…