అంచనాలేమీ తప్పలేదు. మళ్లీ ముంబయి ఇండియన్సే ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇది చాలామందిని నిరాశ పరిచింది. కానీ ఆ జట్టు బలం అలాంటిది మరి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్.. ఇలా ఏ రకంగా చూసినా ఆ జట్టుకు సాటి వచ్చే మరో టీం ఐపీఎల్‌లో కనిపించదు. ఐపీఎల్ అనే కాదు.. ప్రపంచ క్రికెట్ మొత్తంలో ముంబయి ఇండియన్సే బెస్ట్ ఐపీఎల్ టీం అంటే అతిశయోక్తి కాదు.
ఆ జట్టు స్పెషాలిటీ ఏంటంటే.. వేరే జట్లలో ఫెయిలైన ఆటగాళ్లు కూడా ముంబయికి వస్తే అదరగొట్టేస్తుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ ఢిల్లీ, బెంగళూరు లాంటి జట్లకు ఆడాడు. కానీ పెద్దగా రాణించిందేమీ లేదు. కానీ ముంబయి తరఫున కొన్నేళ్లుగా అదరగొట్టేస్తున్నాడు. ఈసారి కూడా అతను ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ముంబయి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
డికాక్ కొన్నేళ్లుగా ముంబయికి ఆడుతున్నాడు కాబట్టి పక్కన పెడదాం. ఈ సీజన్లోనే ఆ జట్టుకు మారిన ట్రెంట్ బౌల్ట్ సంగతే చూద్దాం. గత ఏడాది అతనాడింది ఢిల్లీ జట్టుకు. కానీ ఆ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినపుడు కూడా అనుకున్నంతగా రాణించలేదు. జట్టులో రబాడ లాంటి టాప్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా బౌల్ట్ ఎందుకులే అనుకుని ఢిల్లీ వాళ్లు అతణ్ని విడిచిపెట్టేశారు. తమకు బౌలర్లకు లోటు లేకపోయినా ముంబయి అతణ్ని తీసుకుంది. బుమ్రాను వెనక్కి నెట్టి అతడితోనే ప్రతి మ్యాచ్‌లోనూ తొలి ఓవర్ వేయించింది.
బౌల్ట్ అదిరిపోయే బౌలింగ్‌తో ప్రత్యర్థులకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చాడు. ముంబయికి ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలందించాడు. తనను వదులుకున్న ఢిల్లీ మీద అయితే అతను మరింత కసిగా బౌలింగ్ చేశాడు. క్వాలిఫయర్‌లో 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా కూడా నిలిచాడు. సన్‌రైజర్స్‌పై రెండో క్వాలిఫయర్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చిన స్టాయినిస్‌ను తొలి బంతికే బౌల్ట్ ఔట్ చేసి ఆరంభంలోనే ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. ఇలాంటి బౌలర్‌ను వదులుకున్నామే అని ఢిల్లీ ఎంతగా ఫీలై ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on November 12, 2020 4:08 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…