అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ తీరానికి చేరనున్నాయి? గెలుపు గుర్రం ఎవరిది? ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సరే! దీనికి సమాధానం ఎలా ఉంటుంది? అనేది కాలం తేల్చనుంది! కానీ, అమెరికా ఎన్నికలు ఇలా.. మారతాయని కానీ, ట్రంప్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని కానీ.. ఎవరైనా ఊహించారా? అసలు ప్రపంచ వ్యాప్తంగా బైడెన్‌పై గెలుపు గుర్రం ఎక్కుతారనే అంచనాలైనా ఉన్నాయా? అంటే.. లేవనే చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాస్తవానికి ఏకపక్షంగా మారిపోతాయని.. ట్రంప్ విజయం ఖాయమని.. సర్వత్రా అనుకున్నారు. ఇది వాస్తవం కూడా.
కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళిని ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే.. ఇప్పటివరకూ జో బిడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు పోలవగా, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి. అమెరికాలో అధ్యక్ష స్థానం సొంతం చేసుకోవాలంటే ఆ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి 270 ఎలక్టోరల్ ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకోవాల్సి ఉంటుంది. మరి ఏకపక్ష విజయం దక్కించుకుంటా రని అంచనాలు వేసుకున్న ట్రంప్.. ఎందుకిలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ట్రంప్ కోరి తెచ్చుకున్న కుంపటి ఏంటి? అనే అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ప్రస్తుతం పరిస్థితి ఉంది కాబట్టి!!
అధ్యక్ష ఎన్నికల సన్నాహాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ గెలుపు ఖచ్చితమనే వ్యాఖ్యలు వినిపించాయి. అంతేకాదు.. డెమొక్రాట్లు.. అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడడం ట్రంప్‌కు దీటైన అభ్యర్థిని వెతకడంలో చేసిన తాత్సారం వంటివి కూడా ట్రంప్‌కు సాటి లేరనే వ్యాఖ్యలే వినిపించాయి. ఈ పరిణామమే.. ట్రంప్‌లో అప్పటి వరకు ఉన్న దూకుడును రెట్టింపు చేసింది. అయితే.. ఈ దూకుడు పాజిటివ్‌గా కాకుండా నెగిటివ్ యాంగిల్ తీసుకుంది. గత ఎన్నికల్లో ట్రంప్ ఏ వ్యవహార శైలిని అవలంభించారో.. దానినే ఈ ఎన్నికల్లోనూ ఆయన అవలంభించారు. కానీ, అప్పటి పరిస్థితి వేరు.
గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలో నిలిచారు. ఆమెను ఏకపక్షంగా ఏకిపారేశారు ట్రంప్. చాలా తీవ్ర పదజాలం ప్రయోగించారు. వాస్తవానికి అప్పటికే ఆమె పాలనేంటో.. ఆమె వ్యవహార శైలి ఏంటో అమెరికన్లకు ఒకింత అనుభవం ఉంది కనుక.. ట్రంప్ వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. కానీ, ఇప్పుడు బైడెన్ పరిస్థితి అలాంటిది కాదు.. ఆయన ఎంపికలోనే చాలా చిత్రమైన పరిణామం ఉంది. పొరుగు దేశాలతో ట్రంప్ అవలంభిస్తున్న వైఖరిని చాలా మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఈ పరిణామాలకు తోడు.. నిజమైన అమెరికన్లు నాకే ఓటేస్తారని వ్యాఖ్యానించడం.. కూడా ట్రంప్‌కు ఇబ్బందికర పరిణామాలను తీసుకువచ్చింది. ఇక్కడ.. జరిగిన ఓటింగ్ సరళిని చూస్తే.. ట్రంప్ పట్ల ప్రజలకు ఖచ్చితంగా అభిమానం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎటోచ్చీ.. ఆయన చివరి దశ ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు,. కరోనా వ్యాక్సిన్ ను ఎన్నికలకు రెండు రోజుల ముందుగానే తీసుకువస్తానని చెప్పి.. చేతులు ఎత్తేయడం వంటివి.. నవంబరు 3న జరిగిన ఎన్నికలపై ప్రభావం చూపించింది. నోటిదురుసు.. కలివిడి లేకపోవడం.. భవిష్యత్ వ్యూహం కొరవడడం.. మూస విధానంలో ప్రచారం చేయడం వంటివి.. ట్రంప్‌కు మైనస్ అయితే.. బైడెన్‌కు ఎలాంటి హంగూ లేకుండా.. ట్రంప్ వ్యతిరేకతే.. ఆయనకు ప్లస్ అయింది. ఇలా మొత్తంగా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ చేసుకున్న వివాదమే ఆయనకు ఇబ్బంది పెట్టింది తప్ప.. బైడెన్ బలం ఏమాత్రం కాదనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 6, 2020 2:36 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…