“తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు.”- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు. చలాన్లపై రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదీలు.. వ్యక్తం చేసిన బాధను ఆయన పట్టించుకునీ పట్టించుకోకుండా.. తన వారిని వెనుకేసుకువచ్చిన తీరు.. పెద్ద చర్చకు దారితీసింది. దీంతో అసలు సామాన్యులేనా.. పోలీసులు మాత్రం వాహనాల డ్రైవింగ్ , ట్రాఫిక్ రూల్స్ విషయంలో తప్పులు చేయడం లేదా? అనే ప్రశ్నలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇతరులను హెల్మెట్ పెట్టుకోవాలని.. ట్రిపుల్ రైడింగ్ వద్దని చెప్పే పోలీసులు.. వారు కూడా పాటించాలి కదా! అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ మెన్(ఖచ్చితమైన నిబంధనలు పాటించే వ్యక్తిగా)గా పేరొంది.. పలు మార్లు సామాజిక పురస్కారాలు కూడా అందుకున్న లోకేంద్ర సింగ్.. తాజాగా పోలీసుల ట్రాఫిక్ వైలేషన్స్‌పై పక్కా సమాచారాన్ని రాబట్టారు. ఇదేదో.. ఎక్కడో చూసి.. ఎవరో చెప్పగా.. ఆయన వెలుగులోకి తెచ్చింది కాదు. సాక్షాత్తూ.. సమాచార హక్కు చట్టం కింద.. ప్రభుత్వం (డీజీపీ ఆఫీసు)నుంచే పక్కా సమాచారం రాబట్టేశారు. దానిని లోకేంద్రసింగ్ మీడియాకు వెల్లడించడంతో ‘పోలీసోళ్లకూ చలాన్లు పడ్డాయ్’ అనే విషయం బట్టబయలైంది.
అంతేకాదు.. సాధారణంగా ఒకటి రెండు చలాన్లు పెండింగులో ఉంటేనే ముక్కుపిండి మరీ వసూలు చేసే పోలీసులు.. తమ విషయానికి వస్తే.. ఏకంగా లక్షల రూపాయలను పెండింగులో పెట్టారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, నో హెల్మెంట్, నోడీఎల్, సహా.. రాష్ డ్రైవింగ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఏకంగా 17 వేల 391 చలానాలు పెండింగులో ఉన్నాయని డీజీపీ ఆఫీసే వెల్లడించింది. చిత్రం ఏంటంటే.. ఇవన్నీ హైదరాబాద్ పరిధిలోవే కావడం గమనార్హం. మొత్తంగా ఈ చలాన్ల కింద పోలీసులు కట్టాల్సిన సొమ్ము.. 68 లక్షల, 67 వేల రూపాయలకు పైగానే ఫైన్ కింద చెల్లించాలి.
అయితే.. ఈ సొమ్మును ఎవరు కడతారు? అనేది కీలక ప్రశ్న. వాహనాలన్నీ.. ఎవరు నడిపినా.. కేసులు ఎవరిపై నమోదైనా.. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు డీజీపీ చెక్కు ద్వారా ఆ సొమ్మును చెల్లించాలి. ఈ సొమ్ము ఆయనకు ఎక్కడ నుంచి వస్తుంది..? అంటే.. ప్రభుత్వం కేటాయించి హోం శాఖ నిధుల నుంచి ఆయన చెల్లిస్తారు. అంటే.. మళ్లీ అది ప్రజల సొమ్మే. అయితే.. ఇది ఎలా ఉన్నా.. పోలీసులు కూడా ట్రాఫిక్‌ను ఉల్లంఘిస్తున్నారన్న విషయం వెలుగులోకి పక్కా ఆధారాలతో వచ్చేసరికి నెటిజన్లు బుగ్గలు నొక్కుకుంటున్నారు. మాకేనా రూల్స్ మీకు లేవా?.. ఆ చలానాలు ఎవరైతే వాహనాలునడిపారో.. (కానిస్టేబుల్, హోం గార్డ్, హెడ్ కానిస్టేబుల్ స్తాయి) వారి నుంచి వసూలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 4, 2025 11:07 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…