మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని సంప్రదింపులు జరిపినప్పటికీ చివరికి బంతి నయనతార దగ్గర ఆగినట్టు ఫిలిం నగర్ టాక్. రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఆలస్యం చేయడానికి అనిల్ దగ్గర ఎక్కువ టైం లేదు. ఎందుకంటే 2026 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే మే మినహాయించి చేతిలో ఉన్న ఏడు నెలల్లో కాపీ సిద్ధమైపోవాలి. మధ్యలో విశ్వంభర విడుదల, ప్రమోషన్లు, ఈవెంట్లు ఇవన్నీ కలుపుకునే అంత టైం మాత్రమే మిగిలి ఉంది.
ఒకవేళ నయన్ కనక ఓకే అయితే ఈ కాంబోలో మూడో సినిమా అవుతుంది. మొదటిది సైరా నరసింహారెడ్డిలో భార్యగా చేసిన పాత్ర ఏమంత పేరు తీసుకురాలేదు. ఫలితం కూడా యావరేజ్ గానే రావడంతో ల్యాండ్ మార్క్ మూవీ అవ్వలేదు. రెండోది గాడ్ ఫాదర్. చిరంజీవి చెల్లెలుగా నయన్ పాత్ర బాగానే ఉన్నప్పటికీ బ్యాలన్స్ తప్పిన పొలిటికల్ కంటెంట్ ఆడియన్స్, ఫ్యాన్స్ ని పూర్తిగా మెప్పించలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ అంత బలంగా లేకపోవడంతో చాలా ఏరియాల్లో ఫ్లాప్ గా నిలిచింది. సో ఇప్పుడు హ్యాట్రిక్ అవ్వకుండా సూపర్ హిట్ బోణీ జరగాలి. ఫ్యాన్స్ కోరుకునేది అదే.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి వచ్చే దాకా వెయిట్ చేయాలి. ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది కానీ అది నిజం కాదట. ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు కానీ దానికి సంబంధించి క్లారిటీ లేదు. స్క్రిప్ట్ లాక్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం లొకేషన్ల వేట, క్యాస్టింగ్ పనుల్లో ఉన్నాడు. వేసవిలో రెగ్యులర్ షూట్ కు వెళ్లే ప్రతిపాదన ఉంది. విశ్వంభరకు సంబంధించి ఇంకొక్క పాట పెండింగ్ ఉంది. డబ్బింగ్ పనులున్నాయి. మొత్తానికి పండగ డెడ్ లైన్ పెట్టుకున్న రావిపూడికి పెద్ద బరువు బాధ్యతలే పడబోతున్నాయి. ముఖ్యంగా అభిమానులు కోరుకుంటున్న వింటేజ్ చిరుని చూపించే విషయంలో.
This post was last modified on May 4, 2025 11:35 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…