హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను బాలుర హాస్టల్‌లోకి తీసుకెళ్లేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే… ఆ విద్యార్థి తన లవర్‌ను హాస్టల్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ నిబంధనల వల్ల నేరుగా తీసుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఒక పెద్ద సూట్‌కేస్‌లో ఆమెను పెట్టాడు. ఆ సూట్‌కేస్‌ను లగేజ్‌గా తీసుకుని హాస్టల్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే హాస్టల్ గేటుపై గస్తీగా ఉన్న గార్డులకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వెంటనే అతడిని ఆపి, సూట్‌కేస్‌ను తెరవాలని ఆదేశించారు.
గార్డులు సూట్‌కేస్‌ను తెరిచిన వెంటనే అందులో నుంచి ఒక యువతి బయటపడటం చూసి అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో అమ్మాయి సూట్‌కేస్‌లోంచి బయటకి వస్తుండగా… కొంత మంది నవ్వుతుండటం, మరికొంతమంది ఆశ్చర్యపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ఘటనపై విశ్వవిద్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హాస్టల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ విద్యార్థిపై చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇది ప్రేమే కాదు వినూత్న మూర్ఖత్వమని వ్యాఖ్యానిస్తుంటే, మరికొంతమంది “ఇది ట్రూ లవ్ టెస్టు” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రేమ కోసం చేసిన ఈ సూట్‌కేస్ ప్రణాళిక చివరకు యువకుడికి సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on April 12, 2025 2:39 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…