Trends

‘ఎక్స్’ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. ట్విస్టు మామూలుగా ఉండదు

వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ రెండింటిని జోడించి బిజినెస్ చేస్తాడు. రిస్క్ తీసుకునే విషయంలో అతగాడికి మించినోడు మరొకడు ఉండడన్నట్లుగా వ్యవహరిస్తాడు. సాధారణంగా ప్రపంచ కుబేరుడు హోదాలో ఉన్నోడు ఎవరూ కూడా రాజకీయాల్లో వేలు పెట్టేందుకు.. ప్రభుత్వంలో భాగస్వామి కావటానికి అస్సలు ఇష్టపడరు. అందరిలా అలా చేస్తే అతడు మస్క్ ఎందుకు అవుతాడు?మిగిలిన పారిశ్రామికవేత్తలకు తాను భిన్నమన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశాడు మస్క్.

తన చేతిలో ఉన్న సోషల్ మీడియా ఎక్స్ ను తాజాగా అమ్మేసినట్లుగా ప్రకటించాడు. నిజమా? అన్న ఆశ్చర్యానికి గురై.. తేరుకునే లోపు అసలు ట్విస్టును రివీల్ చేసి.. అతగాడి తెలివికి ఫిదా అయ్యేలా చేశాడు. ఎందుకంటే.. ఎక్స్ ను అమ్మింది బయటవారికి కాదు. తనకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీకి అమ్మేశాడు. ఈ మేరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎక్స్ లో వెల్లడించాడు.33 బిలియన్ డాలర్లకు ఎక్స్ ను అమ్మివేసినట్లుగా ప్రకటించిన మస్క్.. దాన్ని కొనుగోలు చేసిన స్టార్టప్ సంస్థ విలువను తాజాగా రూ.80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు. ఎక్స్ ను తనకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఎక్స్ ఏఐ’ కు అమ్మినట్లుగా ప్రకటించారు.

అధునాత ఏఐ సామర్థ్యాన్ని ఎక్స్ కు అనుసంధానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాల్ని రాబట్టవచ్చని తన తాజా పోస్టులో వెల్లడించారు. చాట్ జీపీటీకి పోటీగా గత ఏడాది ఎక్స్ ఏఐ సంస్థను మస్క్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎక్స్ ఏఐ.. ఎక్స్ భవిష్యత్ లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లుగా చెప్పిన మస్క్.. డేటా మోడల్స్ ను అనుసంధానం చేయటం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాల్ని రాబట్టేందుకు ముందడుగు వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రెండు సంస్థలు ఒకటి కావటం ద్వారా కోట్లాది మంది ప్రజలకు అదిరే అనుభూతి అందుతుందని మస్క్ వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ంప్ నకు సలహాదారుగా వ్యవహరిస్తున్న మస్క్.. టెస్లా.. స్పేస్ ఎక్స్ సీఈవోగా కీలక బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చివరగా.. 2022లో ఇప్పటి ఎక్స్ అప్పటి ట్విటర్ ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్.. రెండేళ్లు తిరిగేసరికి దానిని 33 బిలియన్ డాలర్లకు అమ్మేయటం ఒక ఎత్తు అయితే.. సదరు సంస్థను తన స్టార్టప్ కు అమ్మేయటం ద్వారా దాని విలువను ఏకంగా 80 బిలియన డాలర్ల సంస్థగా మార్చటమే మస్క్ ముదురు తెలివికి నిదర్శనంగా చెప్పొచ్చు.

This post was last modified on March 29, 2025 10:05 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఏప్రిల్ 2025 – ఎవరిది సింహాసనం

మార్చి ముగిసిపోయింది. వేసవికి ముందొచ్చే నెలగా బాక్సాఫీస్ దీన్ని కీలకంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా పిల్లల పరీక్షలు అయిపోయి సెలవులు ప్రారంభమవుతాయి…

31 minutes ago

ఉక్కు ‘సంకల్పం’పై ఇక డౌట్లు అక్కర్లేదు!

ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ సాగుతున్న ప్రచారం ఇక దుష్ప్రచారం కిందే పరిగణించక తప్పదు. ఇకపై ఈ…

2 hours ago

సికందర్ ఫెయిల్యూర్.. ఆ హీరో ఫ్యాన్స్‌లో టెన్షన్

మురుగదాస్.. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. రమణ, గజిని, గజిని (హిందీ), తుపాకి, కత్తి లాంటి బ్లాక్…

3 hours ago

ప్యాన్ ఇండియా నిర్మాతలూ….పారా హుషార్

అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక…

5 hours ago

బాలయ్యతో మళ్లీ విద్యాబాలన్?

విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…

10 hours ago

మోడీకి 75 ఏళ్లు.. రంగంలోకి ఆర్ ఎస్ ఎస్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబ‌రు 17తో 75 ఏళ్లు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74…

10 hours ago