Trends

సోషల్ మీడియాను ఊపేస్తున్న భార్యభర్తల గొడవ

సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత వ్యవహారం సైతం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఇప్పుడు ఓ భార్యాభర్తల గొడవ అలాగే హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైకి చెందిన ప్రసన్న-దివ్య అనే జంటకు సంబంధించిన విడాకుల గొడవ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వాళ్లిద్దరూ తమిళ వ్యక్తులైనప్పటికీ.. దేశవ్యాప్తంగా వీరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అక్రమ సంబంధం లీడ్ టాపిక్ కావడమే అందుకు ముఖ్య కారణం.

పన్నెండేళ్ల కిందటే పెళ్లి చేసుకున్న ప్రసన్న-దివ్య యుఎస్‌లో సెటిలయ్యారు. ఇద్దరూ యుఎస్ సిటిజెన్స్‌. వీరికి తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. ప్రసన్న యుఎస్‌లో ‘రిప్లింగ్’ పేరుతో స్టార్టప్ పెట్టాడు. అది 10 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. ఐతే కొన్నేళ్ల కిందట ప్రసన్నకు, దివ్యకు విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ప్రసన్న మీద దివ్య అమెరికాలోనే కాక సింగపూర్‌లోనూ కేసులు పెట్టింది. వీళ్లిద్దరూ రెండేళ్ల పాటు సింగపూర్‌లో ఉన్నారు. కానీ రెండు చోట్లా కేసులు నిలబడలేదు. ప్రసన్న తప్పేమీ చేయలేదని అక్కడి న్యాయస్థానాలు తేల్చాయి.

కానీ ఇద్దరూ చెన్నైకి చేరుకోగా.. ఇక్కడ తన కొడుకును ప్రసన్న కిడ్నాప్ చేశాడని.. అతను తన అనుమతి లేకుండా రేప్ చేశాడని.. ఇలా పలు సెక్షన్ల కింద కొన్ని రోజుల కిందట దివ్య కేసులుపెట్టింది. దీంతో తమిళనాడు వదిలి ఎక్కడికో ఉంటూ సోషల్ మీడియాలో తన కథేంటో రెండు రోజుల కిందట వివరించాడు ప్రసన్న. అక్కడే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తన నేపథ్యాన్ని వివరిస్తూ దివ్య.. అనూప్ అనే జిమ్ ట్రైనర్‌తో కొన్నేళ్ల కింద ఎఫైర్ పెట్టుకున్న విషయాన్ని ప్రసన్న వెల్లడించాడు. అలా అని అతనేమీ ఊరికే ఆరోపణ చేసి వదిలేయలేదు. అనూప్ భార్య తనకు పంపిన కొన్ని ఆధారాలను బయటపెట్టాడు.

అనూప్‌తో చాటింగ్ సందర్భంగా ‘ఎక్స్‌ఎల్’ సైజు కండోమ్ తీసుకురావాలని పేర్కొనడం.. అలాగే అనూప్‌తో కలిసి గడిపేందుకు హోటల్ రూం బుక్ చేయడం.. వీటికి సంబంధించిన ఆధారాలను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే దివ్య అనుమతితోనే తాను తన కొడుకును తీసుకెళ్లగా.. ఇప్పుడు కిడ్నాప్ చేసినట్లు ఆరోపించడం గురించి కూడా అతను ఆధారాలు బయటపెట్టాడు. తప్పుడు కేసులు పెట్టి తనను దివ్య ఎలా టార్చర్ చేస్తున్నది అతను వివరిస్తూ పోస్టులు పెట్టగా.. అతడికి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది.

రెండు రోజులుగా దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. దివ్య కూడా తన భర్త సెక్స్ పిచ్చోడని… అమ్మాయిలను అసభ్య వీడియోలు తీస్తాడని.. ఇంకా ఏవేవో ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్ లభించట్లేదు. దివ్య గురించి ప్రసన్న చేసిన ఆరోపణలకు ఆధారాలుండడం, ఈ వ్యవహారంలో అతనే బాధితుడిలా కనిపిస్తుండడంతో ప్రసన్నకు సోషల్ మీడియా బాసటగా నిలుస్తోంది. ఇటీవలే ప్రియుడితో కలిసి ముస్కాన్ అనే మహిళ భర్తను పాశవికంగా చెప్పిన ఓ కేసు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. భర్తలను మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళల గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు.

దివ్య చేసిన తప్పుల గురించి స్పష్టమైన ఆధారాలుండడంతో ఆమె మీద మండిపడుతున్నారు. ప్రసన్న పోస్టులు వైరల్ అయిన నేపథ్యంలో చెన్నై పోలీస్ కమిషనర్ అతడికి ఫోన్ చేసి తనను అరెస్ట్ చేయమని.. చెన్నైకి రావాలని.. అంతా చట్టప్రకారం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా అతను పోస్ట్ చేసి తనకు అండగా నిలిచిన సోషల్ మీడియాకు కృతజ్ఞతలు చెప్పాడు.

This post was last modified on March 25, 2025 1:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?

ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా నాటి ప్రభుత్వ పాలనలో తామెలాంటి…

1 hour ago

ట్విస్ట్ : ప్రీమియం లొకేషన్లకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు

రాబిన్ హుడ్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ బయటికి వచ్చాక దాని…

2 hours ago

పెద్దాయన క్షమాపణ…ఇక వదిలేయొచ్చు

ఇటీవలే జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో చిన్న పాత్ర…

2 hours ago

రామ్ చరణ్ పుట్టినరోజుకు ‘పెద్ది’ వస్తాడా

ఎల్లుండి రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఒక క్రేజీ కంటెంట్ ఆశిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్సి…

3 hours ago

మహిళా ఎమ్మెల్యేకు సారీ చెప్పిన స్పీకర్

గెడ్డం ప్రసాద్ కుమార్… తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత. ఆది నుంచి…

3 hours ago

దేశమంతా మాట్లాడుకునేలా….బన్నీ – త్రివిక్రమ్ మూవీ

ఇప్పట్లో మొదలవ్వకపోయినా అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ గురించి అప్పుడే ఓ…

3 hours ago