ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి నాయకత్వం వహించిన పంత్, ఈ సీజన్‌కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వెళుతూ భారీ డీల్ తో వార్తల్లోకి వచ్చాడు. ఏకంగా రూ.27 కోట్లతో అతను టోర్నీలోనే అత్యధిక రేటుతో కొనుగోలైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతని పాత్రపై ఆశలు అమాంతం పెరిగాయి. అయితే మొదటి మ్యాచ్‌నే చూస్తే ఆ అంచనాలు పూర్తిగా తారుమారు అయినట్టే.
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నోకు గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా… పంత్ మాత్రం ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ కావడం తీవ్ర నిరాశను మిగిల్చింది. టాప్ ఆర్డర్‌లో మిగతా ప్లేయర్స్ బాగానే ఆడినా.. పంత్ అతి త్వరగా వెనుదిరిగిన తర్వాత భారీ స్కోరు చేయడంలో కాస్త తడబడింది. ఒకవైపు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లాంటి బ్యాటర్లు భారీ స్కోర్లు చేయగలుగుతుంటే, కెప్టెన్ స్థాయిలో పంత్ ఏకంగా 6 బంతులు మింగేసి వెళ్లిపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
పంత్ డిజాస్టర్ ఇక్కడితో ఆగలేదు. ఢిల్లీ అలౌట్ అయ్యే పరిస్థితిలో ఉండగా… చివర్లో వచ్చిన మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని కూడా పంత్ వదిలేశాడు. ఒక దశలో విజయం సులభంగా లక్నో వైపు మళ్లినప్పటికీ, ఆ ఒక్క స్టంపింగ్ మిస్ అవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. అషుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, చివర్లో మోహిత్‌ను ఔట్ చేస్తే.. విజయం లక్నో ఖాతాలో పడేది. కానీ, పంత్ చేతిలోంచి జారిన ఆ ఛాన్స్ జట్టుకు ఘోర పరాభవంగా మారింది.
కెప్టెన్సీ, బ్యాటింగ్, వికెట్ కీపింగ్.. మూడు విభాగాల్లోనూ పంత్ మొదటి మ్యాచ్‌లో నిరుత్సాహపరిచిన ఫలితాన్ని లక్నో గ్రహించాల్సిందే. రూ.27 కోట్లు పెట్టి తీసుకున్న ఓ సీనియర్ కెప్టెన్ ఇలాంటి మ్యాచ్‌లో తేలిపోవడం, మ్యాచ్ మోమెంటమ్‌ను కోల్పోవడం వంటి అంశాలపై తీవ్ర విశ్లేషణ మొదలవుతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క మ్యాచ్‌తోనే తీర్పు చెప్పలేమని అనుకున్నా… పంత్ తన విలువను ప్రూవ్ చేసుకోవాలంటే తర్వలోనే బౌన్స్ బ్యాక్ కావడం తప్పనిసరి.
This post was last modified on March 25, 2025 5:52 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…