Trends

ట్రంప్ షాకింగ్ డీల్.. ఎలన్ మస్క్‌కు బూస్ట్?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన చేసిన పని రాజకీయంగానే కాకుండా మార్కెట్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న వేళ, ట్రంప్ తన మద్దతుగా టెస్లా కారును కొనుగోలు చేశారు. వైట్ హౌస్ ఆవరణలోనే మస్క్ సమక్షంలో ఈ డీల్ జరిగింది. ప్రత్యేకంగా ఎర్ర రంగులోని మోడల్ ఎక్స్ కారును ట్రంప్ ఎంపిక చేసుకున్నారు. ఈ కారు ధర సుమారు $80,000 (రూ. 66 లక్షలు) ఉంటుంది. అయితే మస్క్ తనకు డిస్కౌంట్ ఇస్తానని చెప్పినా, తాను పూర్తిగా తన ఖర్చుపైనే కొనుగోలు చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ వ్యవహారానికి మరింత ఆసక్తికరమైన కోణం ఉంది. ఇటీవల టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. గత నెలలోనే కంపెనీ మార్కెట్ విలువ 30% పడిపోయింది. ప్రధానంగా మస్క్ అమెరికా ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు మద్దతు ఇవ్వడం వల్ల టెస్లాపై నెగటివ్ ప్రచారం పెరిగింది. మస్క్ DOGE (Department of Government Efficiency) కార్యకలాపాలను నడిపించడం పట్ల నిరసనగా, అమెరికా అంతటా టెస్లా షోరూంల వద్ద భారీ ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. “ఎలన్ మస్క్ గో అవే” అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

ఈ తరుణంలో ట్రంప్ మద్దతుగా టెస్లా కారును కొనుగోలు చేయడం మస్క్‌కు ఊరటను కలిగించే అంశంగా మారింది. తన నిర్ణయంపై ట్రంప్ మాట్లాడుతూ, “టెస్లా ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను తయారు చేస్తోంది. మస్క్ తన జీవితాన్ని ఈ కంపెనీ కోసం అంకితం చేశాడు. కానీ అతన్ని అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం మస్క్‌కు మద్దతుగా కాదు, నిజమైన దేశభక్తులందరికీ మద్దతుగా కూడా భావించాలి,” అని వ్యాఖ్యానించారు.

ట్రంప్, మస్క్ అనుబంధం గతంలో పెద్దగా ఉండలేదు. మస్క్ కొన్నిసార్లు రిపబ్లికన్ సిద్ధాంతాలకు మద్దతు తెలిపినా, కొన్ని సందర్భాల్లో డెమోక్రాట్ల వైపు నిలబడ్డాడు. కానీ తాజాగా ట్రంప్ మస్క్‌ను “పేట్రియట్” అని అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది. టెస్లా షేర్ల కుప్పకూలిన నేపథ్యంలో, ట్రంప్ చేసిన ఈ స్టెప్ కొంతవరకు కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ను రక్షించేందుకు ఉపయోగపడే అవకాశముంది. ట్రంప్ ప్రకటన తర్వాత టెస్లా స్టాక్‌లో కొంత ఊపొచ్చింది. సోమవారం 15% పడిపోయిన షేర్లు, మంగళవారం 5% పుంజుకున్నాయి. అయితే, పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ మద్దతు మార్కెట్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి.

This post was last modified on March 12, 2025 2:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

48 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago