Trends

రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరపడినట్లే.. టార్గెట్ @2027!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలుపుతో భారత క్రికెట్ మళ్లీ చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటముల అనంతరం టీమిండియా స్థిరతపై ప్రశ్నలు వచ్చాయి.

కానీ ఫైనల్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆ అనుమానాలకు తెరపడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్ అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. విజయం అనంతరం మాట్లాడిన కోహ్లీ, జట్టు మంచి స్థితిలో ఉందని, సీనియర్లు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం వల్లనే ఈ ఘనత సాధించామని తెలిపాడు.

“ఈ జట్టు విజయాలను అందుకునే అద్భుతమైన స్థాయిలో ఉంది. ఇది మా కష్టానికి ఇది ఫలితం. జట్టులోని ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు నిర్వర్తించారు. శుభ్‌మన్, శ్రేయస్, రాహుల్ లాంటి ఆటగాళ్లు టీమ్‌ను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. మేము ఎప్పటికీ మద్దతుగా ఉంటాం” అంటూ కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఇక రిటైర్మెంట్ ఊహాగానాల విషయానికి వస్తే, ఇప్పట్లో ఎవరూ అంతమొందే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది. 2027 వరల్డ్ కప్ వరకు తమ ప్రస్థానం కొనసాగుతుందనే సంకేతాలను కోహ్లీ ఇచ్చాడు. రోహిత్ శర్మ, జడేజా కూడా భవిష్యత్తుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భారత క్రికెట్‌కు ఈ సీనియర్ ఆటగాళ్లు మరికొన్ని సంవత్సరాలు అండగా ఉంటారని అభిమానులు విశ్వసిస్తున్నారు.

This post was last modified on March 9, 2025 11:25 pm

Share

Recent Posts

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

18 minutes ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

1 hour ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

1 hour ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

12 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

13 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

13 hours ago