ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ఓటమితో ఆతిథ్య జట్టు పాక్ ఇంటిదారి పట్టింది. తన కెరీర్ లో 51వ సెంచరీ సాధించిన కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 14వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 287 ఇన్నింగ్స్‌లు ఆడి కోహ్లీ ఈ ఘనత సాధించగా… సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌లు, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ ఘనత సాధించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 3, హార్దిక్ పాండ్యా 2, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ, గిల్ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే, రోహిత్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్, కోహ్లీలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ (46) ఔటైన తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడారు. కోహ్లీ, అయ్యర్ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు.
56 పరుగులు చేసి చివర్లో అయ్యర్ అవుట్ అయ్యాడు. భారత్ విజయానికి 2 పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ 96 పరుగులతో స్ట్రైక్ లో ఉన్నాడు. చక్కటి బౌండరీతో సెంచరీ చేసి భారత్ కు కోహ్లీ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చాలాకాలం తర్వాత కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అనిపించేలా కోహ్లీ అద్భుతమైన షాట్లతో సెంచరీ బాదాడు.
This post was last modified on February 23, 2025 10:51 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…