Trends

కిడ్నాప్ కథ విషాదాంతం.. ఒక భయపెట్టే వాస్తవం

ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వ్యక్తే వారి పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. పిల్లాడిని విడిచిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతను కోరినట్లే డబ్బులివ్వడానికి కూడా ఆ కుటుంబం సిద్ధమైంది. ఐతే డబ్బులు తీసుకునేందుకు వచ్చిన కిడ్నాపర్ పోలీసులకు దొరికిపోయాడు. అంతటితో కథ సుఖాంతం అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో దారుణమైన విషయం బయటపడింది. పిల్లాడిని తీసుకెళ్లిన రెండు గంటల్లోనే చంపేశాడా దుర్మార్గుడు. కానీ ఆ విషయం చెప్పకుండా డబ్బుల కోసం బాధిత కుటుంబానికి ఫోన్లు చేశాడు. మహబూబ్ నగర్‌కు చెందిన దీక్షిత్ రెడ్డికి సంబంధించిన విషాదాంతమిది.

రెండు రోజుల కిందట ఈ బాలుడి కిడ్నాప్ గురించి మీడియాలో బాగానే హడావుడి జరిగింది. కిడ్నాపర్ పోలీసులకు దొరుకుతాడో లేదో కానీ.. పిల్లాడు క్షేమంగా బయటికి వస్తే చాలని అంతా అనుకున్నారు. వస్తాడనే ఆశతోనే ఉన్నారు. కానీ ఎవరూ ఊహించనిది జరిగింది. బాధిత కుటుంబంతో సన్నిహితంగా మెలిగే బైక్ మెకానిక్ అయిన మంద సాగరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి దీక్షిత్‌తో మంచిగా మాట్లాడి బైక్‌లో తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు సాగర్. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీలు లేని మార్గంలోనే అతను పిల్లాడిని తీసుకెళ్లడం గమనార్హం. అయినా సరే.. ఒక చోట సీసీటీవీలో బైక్‌పై దీక్షిత్‌ను తీసుకెళ్తున్న దృశ్యం రికార్డయింది.

దీక్షిత్‌ను ఇలా తీసుకెళ్లిన సాగర్.. అతను ఇంటికి వెళ్లాలని గొడవ చేసినపుడు కంగారులో చంపేసి ఉంటాడని భావిస్తున్నారు. నిద్ర మాత్రలు మింగించి గొంతు పిసికి చంపేసిన సాగర్.. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఐతే సాధారణ బైక్ మెకానిక్ అయిన సాగర్.. పోలీసులకు దొరక్కుండా ఫోన్ చేసి బాధిత కుటుంబాన్ని బెదిరించిన వైనం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

యుఎస్‌లో రిజిస్టర్ అయిన ‘డింగ్ టోన్’ అనే యాప్ ద్వారా అతను కాల్ చేయగలిగాడు. కిడ్నాపర్‌ నుంచి కాల్స్ వచ్చినపుడు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించలేకపోయారు. ఆ యాప్‌లో సాగర్ తన స్నేహితుడి ఫోన్‌కు ఓటీపీ పంపించుకుని లాగిన్ అవ్వడంతో అతణ్ని పట్టుకోవడం పోలీసులకు కష్టమైంది.

ముందు ఒకసారి డబ్బుల కోసం చెప్పిన ప్రదేశానికి రాకుండా ఆగిపోయిన సాగర్.. రెండోసారి చెప్పిన చోటుకు వచ్చి అక్కడ మాటు వేసి ఉన్న పోలీసులకు దొరికిపోయాడు. ఐతే పిల్లాడిని తీసుకెళ్లిన రెండు గంటల్లోనే చంపేయడంతో నిందితుడిని పట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఐతే ఈ కేసు పోలీసులకు సవాలుగా తయారైన నేపథ్యంలో కిడ్నాపర్లకు వరంలా మారే ‘డింగ్ టోన్’ లాంటి యాప్‌లన్నింటినీ నిషేధించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది.

This post was last modified on October 23, 2020 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంటయ్యా!

కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…

36 minutes ago

వయోలెన్స్… వయోలెన్స్… : 5 రోజులకే 50 కోట్లు!

ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…

6 hours ago

చరణ్ VS అజిత్ : తప్పేలా లేదు కానీ…

సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…

7 hours ago

టాలీవుడ్ లో ఆ స్పేస్ రాజుగారిదేనా?

టాలీవుడ్‌లో స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు.. వాటిని ప‌రిష్క‌రించే వ్యూహాలు.. చ‌తుర‌త ఉన్న ప్ర‌ముఖుల కోసం.. ఇప్పుడు న‌టులు, నిర్మాత‌లు ఎదురు చూసే…

8 hours ago

వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. సిరి కోల్పోయిన శ్రీల‌క్ష్మి!

ఐఏఎస్ అధికారి.. శ్రీల‌క్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ‌ వ్యాప్తంగా తెలుసు. దీనికి కార‌ణం .. దేశంలోనే…

8 hours ago

ప‌ద‌హారు వేల‌ ప‌దవులు.. చంద్ర‌బాబు బీసీ మంత్రం.. !

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో బీసీ మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. వారికి ఇప్ప‌టికే.. స‌రైన స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పించిన…

10 hours ago