ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం ఆస్తులను కేటాయించవచ్చన్న అంచనాలను తలకిందులు చేస్తూ, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తికి భారీగా 500 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదనపు లబ్ధిదారుడు మోహిని మోహన్ దత్తా అని తెలుస్తోంది.
మోహిని మోహన్ దత్తా పేరు టాటా గ్రూప్‌తో పెద్దగా సంబంధం లేకపోయినా, ఆయన రతన్ టాటాకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ట్రావెల్ వ్యాపార రంగానికి చెందిన దత్తా కుటుంబం స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీని నిర్వహించేది. ఇది 2013లో టాజ్ హోటల్స్ లో భాగమైన టాజ్ సర్వీసెస్‌తో విలీనం అయ్యింది. ఈ విలీనానికి ముందు, స్టాలియన్ కంపెనీలో 80% వాటా దత్తా కుటుంబానికి ఉండగా, మిగతా వాటా టాటా ఇండస్ట్రీస్‌కు చెందినది.
రతన్ టాటాతో ఆరు దశాబ్దాల అనుబంధం
టాటా గ్రూప్ వర్గాల సమాచారం ప్రకారం, మోహిని మోహన్ దత్తా రతన్ టాటాతో 60 ఏళ్లకు పైగా బంధాన్ని కొనసాగించిన వ్యక్తి. 1960ల్లో జంషెడ్‌పూర్‌లో జరిగిన మొదటి పరిచయం తర్వాత, ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దత్తా గతంలో రతన్ టాటా తనను వ్యక్తిగతంగా ఎలా ఆదుకున్నారో పలు సందర్భాల్లో వెల్లడించినట్లు సమాచారం. 2024 అక్టోబర్‌లో రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా కూడా ఆయన ఈ బంధాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే, రతన్ టాటా తన సంపదలో పెద్ద భాగాన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలకు కేటాయించారు. ఆయన సోదరీమణులు కూడా తమ వాటాను దానం చేసే అవకాశం ఉందని టాటా కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఫౌండేషన్ ద్వారా టాటా ట్రస్ట్‌లకు భారీగా ఆస్తులు వెళ్లే అవకాశం ఉంది.
ఈ వారసత్వ వ్యవహారం రతన్ టాటా కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా మోహిని మోహన్ దత్తా పేరు చాలా మందికి అంతగా తెలిసినది కాదు. అయితే, ఆయనకు ఈ భారీ మొత్తం కేటాయించడాన్ని కుటుంబ సభ్యులు ఆత్మీయ బంధంతోనే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద, రతన్ టాటా తన సంపదను ఊహించని విధంగా పునర్వ్యవస్థీకరించడమే కాకుండా, తన నమ్మకస్తుడికి ఊహించని బహుమతిని ఇచ్చినట్లయ్యింది.
This post was last modified on February 7, 2025 4:23 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…