ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే చలానాలు వేయటం, లేదంటే పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారుల్ని ఆపి.. వారి చేత ఫైన్లను క్లియర్ చేస్తుంటారు. కానీ.. బెంగళూరు పోలీసులు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఒక స్కూటర్ మీద ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి.
ఇంత భారీగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. హెల్మెట్ లేకుండా స్కూటర్ ను నడపటం.. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడటం.. సిగ్నల్ జంపింగ్.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రోడ్డు మీద ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడిపే ఈ వ్యక్తి పెరియాస్వామిగా గుర్తించారు. బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన ఇతడు ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతుంటాడు.
తాను నడిపే స్కూటర్ మీద భారీగా చలానాలు విధిస్తున్న విషయాన్ని గుర్తించలేదు. కానీ.. సదరు వ్యక్తి వాహన చలానాల్ని ఏడాదిగా గమనిస్తున్న ఒక స్థానికుడు మాత్రం సదరు బైక్ ను పోలీసులు ఇంకా ఎందుకు సీజ్ చేయలేదంటూ ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన వాదనకు సాక్ష్యంగా చలానాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జత చేశాడు. ఈ పోస్టు మీద బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా నిద్ర లేచారు.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్కూటర్ మీద 311 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఉన్నట్లుగా గుర్తించి.. వెంటనే సదరు వాహనం గురించి ఆరా తీశారు. అదే సమయంలో.. వందలాది చలానాల ప్రింట్ తీయటంతో అది కాస్తా 20 మీటర్ల పొడవు వచ్చింది. మొత్తం చలానాల మీద విధించిన ఫైన్ మొత్తం రూ.1,61,500గా తేల్చారు. రికార్డు స్థాయిలో కేసులు నమోదైన స్కూటర్ ను వాయు వేగంతో సీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. సదరు వాహనదారుడు పోలీసులను సైతం విస్మయానికి గురి చేశాడు. స్కూటర్ విలువ కంటే ఎక్కువగా ఉన్న చలానాల్ని క్లియర్ చేసేసి.. బైక్ ను తీసుకెళ్లేందుకు స్టేషన్ కు వచ్చాడు. అయితే.. అతనికి స్కూటర్ బండి తాళాలు ఇచ్చే వేళలో.. ట్రాఫిక్ నిబంధనల్ని కచ్ఛితంగా పాటిస్తానని మాట ఇచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 6, 2025 10:16 am
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…