ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని అయితే.. ఇప్పటికే ఆ సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వరకు చాట్ జీపీటీ అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీనిని కొన్నాళ్లుగా వినియోగిస్తున్నారు కూడా. అయితే.. దీనికి పోటీగా చైనా తీసుకువచ్చిన డీప్-సీక్ ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది.
డీప్ సీక్‌ను చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ప్రభుత్వ, వ్యక్తిగత డేటా వంటివి డీప్ సీక్ ద్వారా చోరీకి గురవు తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. డీప్ సీక్ ద్వారా తమ రహస్యాలు కూడా బహిర్గతం అవు తున్నాయన్న ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే డీప్‌సీక్‌పై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. తమ ప్రజలను వాడొద్దని కోరాయి. అదేవిధంగా చాట్ జీపీటీ కూడా ఇలాంటి ఆంక్షలనే ఎదుర్కొంటోంది.
ఇక, తాజాగా భారత ప్రభుత్వం కూడా.. చాట్ జీపీటీ సహా డీక్ సీక్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చింది. ముక్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక శాఖ వ్యవహారాల్లో పనిచేసేవారు.. రక్షణ రంగానికి చెంది న సంస్థల్లో పనిచేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు.. ఆర్థిక శాఖలో అయి తే.. అసలు చాట్ జీపీటీ, డీప్ సీక్‌లను కడు దూరంలో ఉంచాలని పేర్కొంది. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. తదుపరి నిర్ణయం వెలువడే వరకు చాట్ జీపీటీ, డీప్ సీక్‌లకు దూరంగా ఉండాలనిస్పష్టం చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
This post was last modified on February 5, 2025 3:11 pm
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…