విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాని పరిస్థితి. ఇంటికి అండగా ఉన్న తల్లి అనూహ్యంగా కాలం చేయటంతో.. దిక్కుతోచని ఇద్దరు కుమార్తెలు ఎవరికి చెప్పకుండా.. ఏం చేయాలో తోచక 9 రోజులుగా ఇంట్లోనే ఉంచేసిన పరిస్థితి. చివరకు శుక్రవారం బయటకు వచ్చిన వారు.. ఇరుగుపొరుగుకు చెప్పటంతో.. వారు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసిన విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని చేసే రాజుతో లలితకు పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. మనస్పర్థలతో 2020లో రాజు ఎటో వెళ్లిపోయారు. తన తల్లి అండతో లలిత కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. పెద్దమ్మాయి రవళిక (24) ఒక క్లాత్ షాపులో పని చేస్తుండగా.. చిన్నమ్మాయి యశ్విత (22) ఈవెంట్ సంస్థలో పని చేస్తోంది.
ఆర్నెల్ల క్రితం ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్ కు అద్దెకు మారారు. ఇటీవల లలిత తల్లి మరణించింది. ఆమె మరణంతో లలిత మానసికంగా కుంగిపోయింది. మూడు నెలలుగా అద్దె చెల్లించలేకపోవటం.. జనవరి 21న ఇంటిని ఖాళీ చేస్తామని యజమానికి గడువు కోరారు. ఈ క్రమంలో జనవరి 22న రాత్రి వేళ నిద్రలోనే ఆమె కన్నుమూసింది. తల్లి మరణించటంతో కుంగుబాటుకు గురైన వారు.. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవటంతో తీవ్ర ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.
ఆత్మహత్య చేసుకోవటానికి పదునైన వస్తువులతో ఇద్దరు గొంతు.. మణికట్టుపై కోసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. స్ప్రహ కోల్పోయిన వారు మూడు రోజులు అలానే ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. తిరిగి స్ప్రహలోకి వచ్చిన తర్వాత.. డెడ్ బాడీని ఒక గదిలో ఉంచి.. మరో గదిలో వారు ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి. ఇంటి నుంచి దుర్వాసన రావటంతో.. శుక్రవారం భరించలేని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు.. తల్లి చనిపోయిందన్న విషయాన్ని తెలియజేశారు.
దీంతో.. ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం వెళ్లటంతో వారు ఇంటికి వచ్చి.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న లలిత డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ రాగా.. కుమార్తెల వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. అయితే.. వారు గొంతు.. చేయి కోసుకోవటంతో రక్తం కిందపడటంతో డాగ్ స్వ్కాడ్ పొరపాటు పడి ఉంటాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శవపరీక్ష తర్వాత.. మరణానికి కారణం తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. లలిత సోదరుడు అంబర్ పేటలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. అంత్యక్రియలకార్యక్రమాన్ని చూడాల్సిందిగా లలిత సోదరుడికి పోలీసులు సూచించినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మిగిలిన విషయాలు తెలిసే వీలుంది. ఇక.. ఇద్దరు కుమార్తెలు పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లుగా సమాచారం. దీంతో.. అనుమానాస్పద మ్రతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
This post was last modified on February 1, 2025 11:26 am
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…
నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…
నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…
జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…
వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొడతాడని సంక్రాంతికి వస్తున్నాంలో ఉపేంద్ర లిమయే చెప్పిన డైలాగ్…