కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు ఎగబడతారు. ఇక కోహ్లీ మ్యాచ్ ఫ్రీగా చూసే అవకాశం వస్తే ఎవరు కూడా వెనక్కి తగ్గరు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంకు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కేవలం ఆధార్ కార్డు చూపించి స్టేడియంలో మ్యాచ్ చూడవచ్చని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు.
దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీలో తిరిగి అడుగుపెట్టాడు. గురువారం నుంచి రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లిని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కోహ్లి రీఎంట్రీతో స్టేడియం సందడి మరింత పెరిగింది. స్టేడియం బయట నుంచే అభిమానుల అరుపులు, రణగొణధ్వనులతో ఒక ఊహించని వాతావరణం ఏర్పడింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నినాదాలు మార్మోగిపోయాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ కోహ్లికి గట్టిగా జైకొట్టారు. కోహ్లిని చూడటానికి అరుణ్ జైట్లీ స్టేడియం ముందు అభిమానులు ఉదయాన్నే క్యూ కట్టారు. మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందే స్టేడియం ముందు రెండు కిలోమీటర్ల మేర జనసందోహం కదిలింది.
క్యూలైన్ పెరిగిపోవడంతో గేట్లు తెరవగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్వల్పంగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వారిని అప్రమత్తంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళంలో ఓ పోలీస్ బైక్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అభిమానుల రద్దీకి ముందుగానే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ భద్రతను పెంచింది. స్టేడియంలో ఎంట్రీకి కేవలం మూడు గేట్లు మాత్రమే తెరిచారు.
గేట్లు తెరవగానే కోహ్లిని చూడాలని అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది కూడా అభిమానులను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భద్రత విషయంలో కాస్త పట్టు తప్పినా పెద్ద ప్రమాదమే జరిగేది అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇక కోహ్లి రీఎంట్రీపై క్రికెట్ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించని కోహ్లి రంజీలో ఎలా ఆడతాడన్నది హాట్ టాపిక్ అయ్యింది.
This post was last modified on January 30, 2025 1:45 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…