చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బిలియన్స్ ఖర్చుతో కూడుకున్న ఏఐ టెక్నాలజీని డీప్ సీక్ పేరుతో చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 6 మిలియన్స్ డాలర్ల ఖర్చుతో మాత్రమే ప్రపంచం ముందు పెట్టాడు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు చైనా వైపు చూస్తోంది.
ట్రంప్ లాంటి దిగ్గజాలు కూడా ఈ టెక్నాలజీ విషయంలో అలెర్ట్ గా ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మారుతున్న AI టెక్నాలజీపై అంబానీ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం కూడా తన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని, ప్రత్యేకించి యువత దీని వైపు దృష్టి పెట్టాలని అంబానీ అభిప్రాయపడ్డారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోను AI కి మాత్రం బానిసగా మరవద్దు అని సూటిగా వివరణ ఇచ్చారు. గుజరాత్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అయితే, సొంత తెలివితేటలను మరవరాదని చెప్పారు. AI ఆధారంగా ఎదిగే తరం, స్వతంత్ర ఆలోచనలను వదులుకోకుండా ముందుకు సాగాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
అంబానీ మాట్లాడుతూ, “AI సాధనంగా ఉపయోగపడుతుందని అంగీకరిస్తున్నాను. కానీ, మన మేధస్సును ఉపయోగించుకోవడం మరచిపోవద్దు. మీరు కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత నిజమైన జీవిత పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. అక్కడ ఉపాధ్యాయులు ఉండరు, మీరు నేర్చుకునేది మీ స్వంత అనుభవాల ద్వారా మాత్రమే” అని పేర్కొన్నారు. ఆయన ప్రకటనలు ప్రస్తుతం AIపై జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా చర్చలకు సంబంధించి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడిన అంబానీ, 21వ శతాబ్దం ముగిసే నాటికి దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే భారత్‌ను ఏ శక్తి కూడా అడ్డుకోలేదని స్పష్టంగా తెలియజేశారు. AI సహాయంతో భారతదేశ యువత కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని, అందులో భారతదేశం నాయకత్వం వహించాలని తన ఆశయాన్ని తెలియజేశారు.
This post was last modified on January 30, 2025 1:14 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…