తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి చేసి చంపడం షాక్ కు గురి చేసింది. ఈ సంఘటన సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా జరిగింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
మడికొండకు చెందిన ఆటోడ్రైవర్ రాజ్‌కుమార్‌పై మరో ఆటోడ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేయడంతో, రాజ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనాలు ఉన్నా కూడా కొందరు మాత్రమే దాడిని ఆపేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గొడవ ఆగలేదు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు.
దాడికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు సునిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా కనిపిస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి పాత గొడవలేమైనా కారణమా లేక తాజాగా ఏర్పడిన సమస్యల కారణమా అన్నది విచారణలో తేలనుంది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయి. ప్రజల ముందు జరిగిన ఈ దారుణం, హనుమకొండలో అందరికీ భయాందోళన కలిగించింది.
This post was last modified on January 22, 2025 4:45 pm
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…