రోడ్ల మీద జనాలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడటానికి సింగపూర్లో రోడ్ల మీద పోలీస్ రోబో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఈ ఉదయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్లో షేర్ చేశాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రోబోల సాయం తీసుకుంటున్నాయి.
ఈ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో కరోనా పేషెంట్ల సేవల కోసం రోబోల్ని ఉపయోగిస్తున్నాయి పలు దేశాయి. ఈ కోవలోనే మన దగ్గరా రోబో సేవలు మొదలయ్యాయి. అది తెలుగు గడ్డ మీదే కావడం విశేషం.
ఆంద్రప్రదేశ్‌లోని నెల్లూరులో కరోనా పేషెంట్ల సేవలకు గాను రోబోల సాయం తీసుకుంటున్నారు వైద్యులు. కరోనా పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో వైద్యులు, వారికి సేవలందించేటపుడు నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఎంతగా రక్షణ చర్యలు పాటించినప్పటికీ వాళ్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
వారికి ఈ రకమైన ముప్పు తగ్గించేందుకు గాను నెల్లూరులో రోబో సేవలు ప్రవేశ పెట్టారు. నెల్లూరులోని రీజనల్ కోవిడ్ సెంటర్లో ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మందులు, ఆహార పదార్థాల్ని నెల్వార్ట్ అనే రోబోనే అందజేస్తోంది.
నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను రూపొందించారు. కోవిడ్‌పై పోరాడుతున్న వైద్యులకు ఈ రోబోను అందజేశారు. ఈ సందర్భంగా రోబో పని తీరుపై డెమో కూడా ఇచ్చారు. ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని కరోనా రోగులకు ఈ రోబో సరఫరా చేస్తుందని తెలిపారు.
త్వరలోనే ఇంకో రెండు రోబోలు తయారు చేసి వాటిని నెల్లూరు జిల్లాలోని మిగతా కోవిడ్ ఆసుపత్రులకు అందజేస్తామని ఈ సంస్థ తెలియజేసింది. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని ఈ రోబో పనితీరును గమనించి తయారీదారుల్ని అభినందించారు. ఆసుపత్రిలో జనాలు ఈ రోబో పనితీరును ఆసక్తిగా గమనిస్తున్నారు.
This post was last modified on April 29, 2020 2:42 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…