చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చైనాలో ప్రజలు, విదేశీయులు భద్రంగానే ఉండవచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. ఈ వైరస్‌పై వస్తున్న తప్పుడు కథనాలు, ప్రచారాలు చైనాను దూషించడానికే ఉద్దేశించినవని విమర్శించారు. హెచ్ఎంపీవీ లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వైరస్ బారిన పడినవారి దగ్గరికి ఎక్కువగా వెళ్లడం, చేతులు కలపడం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ వైరస్‌కు ప్రత్యేకమైన టీకా లేదా నిర్దిష్టమైన చికిత్స ఇప్పటికీ లేదు. లక్షణాలను అదుపులో ఉంచే విధంగా మాత్రమే చికిత్స ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు అవగాహనతో ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
This post was last modified on January 4, 2025 10:54 am
సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను నిర్మించి రిలీజ్ చేయడంతో పాటు మరో భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్…
నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు.…
ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఐపీఎస్ మాజీ అధికారి.. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా సస్పెన్షన్‌కు గురైన ఆలూరి బాల…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యం ఏదో ఒక ఇన్ఫెక్షన్.. వైరస్ లాంటివి అందరినీ భయపెడుతున్నాయి. ఇది మనకు సోకడానికి ముఖ్య…
హీరోయిన్లు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వెల్లడించడం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న దశలో ఆ రంగంలోకి అడుగు పెట్టడం…