మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత బ్యాటింగ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో నిలబడ్డాడు. అయితే, మిగతా బ్యాటర్లు అతనికి సహకరించలేకపోయారు. జైస్వాల్‌తో కలిసి రిషభ్ పంత్ కొద్దిసేపు పోరాడాడు. ఈ ఇద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ, పంత్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ చేరాడు. పంత్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినప్పటికీ కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
భారత్ బౌలింగ్‌లో కూడా ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌తో పాటు బొలాండ్ 3 వికెట్లు, నాథన్ లైయన్ 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను సమూలంగా దెబ్బతీశారు. ఈ పరాజయంతో టీమిండియా తేలికపాటి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీస స్థిరత్వాన్ని ప్రదర్శించకపోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ఇక చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే ఛాన్స్ కోసం టీమిండియా ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొంది.
This post was last modified on December 30, 2024 12:54 pm
తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టాలన్న స్పృహ రాను రాను తగ్గిపోతూ వస్తోంది. ఈ ఒరవడి తెలుగులోనే కాదు.. వేరే…
ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి…
టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు…
భారత క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టులో అనేక…
అభిమానులు రోజుకు కనీసం ఒక్కసారైనా తలుచుకోనిదే నిద్రపోని ఎస్ఎస్ఎంబి 29 ఇవాళ పూజ కార్యక్రమంతో మొదలైపోయింది. టాలీవుడ్ నే కాదు…
సంక్రాంతి సినిమాలకు హైప్ తీసుకొచ్చే విషయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. గత ఏడాది గుంటూరు…