Trends

డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ.. ఆస్తి కోసం కుట్ర‌.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌ద‌న్నేలా!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి మండ‌లంలో కొన్ని రోజుల కింద‌ట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ ఘ‌ట‌న వెనుక ఆస్తి కోసం కుట్ర ఉంద‌ని పోలీసులు తేల్చారు. సొంత మ‌ర‌ద‌లికే ఓ బావ భారీ స్కెచ్ గీశాడు. ఓ డెడ్ బాడీని ఇంటికి పంపించి.. ఆస్తి విష‌యంలో జోక్యం చేసుకోకుండా భ‌య భ్రాంతుల‌కు గురి చేయాల‌ని ప్ర‌యత్నించి.. ప‌క్కాగా దొరికి పోయాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌ద‌న్నేలా సాగిన ఈ వ్య‌వ‌హారం.. వారం రోజుల పాటు పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టింది. చివ‌ర‌కు కుట్ర దారుడు దొరికిపోయినా.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అమాయ‌కుడు బ‌ల‌య్యాడు. చివ‌ర‌కు ఆస్తీద‌క్క‌క‌.. హ‌త్యానేరం, కుట్ర‌, మోసం త‌దిత‌ర అనేక సెక్ష‌న్ల కింద భార్యా భ‌ర్త‌లు జైలు పాల‌య్యారు.

ఏం జ‌రిగింది?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి మండ‌లంలోని యండ‌గండి ప్రాంతానికి చెందిన రంగ‌రాజుకు రేవతి, తుల‌సి అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రేవ‌తిని సుద‌ర్శ‌న్ వ‌ర్మ‌(ఇత‌నికి మ‌రో పేరు శ్రీధ‌ర్ వ‌ర్మ కూడా ఉంది)కు ఇచ్చి వివాహం చేశారు. అదేవిధంగా తుల‌సికి కూడా మ‌రో వ్య‌క్తికి ఇచ్చి పెళ్లిళ్లు చేశారు. అంతా బాగానే ఉంద‌నుకున్న స‌మ‌యంలో తుల‌సి భ‌ర్త ప్ర‌మాదంలో మృతి చెందాడు. దీంతో ఆమె తండ్రి వ‌ద్ద కు వ‌చ్చి ఉంటోంది. ఈ క్ర‌మంలో తండ్రి రంగ‌రాజు.. కుమార్తెల‌కు ఇద్ద‌రికీ త‌న ఆస్తిని స‌మానం గా పంచేశాడు. ఎవ‌రి వాటా వారు తీసుకున్నారు.

అయితే.. వ్య‌స‌నాల‌కు బానిస‌గా మారిన శ్రీధ‌ర్‌వ‌ర్మ‌.. భార్య రేవ‌తిలు.. తులసి ఆస్తిని కూడా సొంతం చేసుకోవాల‌ని ప‌క్కా ప్లాన్ వేశారు. అయితే.. దీనికి వారు అనుస‌రించిన మార్గం.. భ‌య భ్రాంతుల‌కు గురి చేయ‌డం. అది కూడా నేరుగా బెదిరించో.. భ‌య పెట్టో కాదు.. చిత్ర‌మైన ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం తులసి.. త‌న తండ్రి రంగ‌రాజు త‌న‌కు ఇచ్చిన ఆస్తిలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో శ్రీధ‌ర్ వ‌ర్మ‌, రేవ‌తిలు.. స్వ‌చ్ఛంద సంస్థ‌త‌ర‌ఫున ఇటుక‌లు, ఇసుక సాయం చేస్తున్న‌ట్టు న‌మ్మించారు. ఈ నేప‌థ్యంలోనే స్థానికంగా ఉండే వ్య‌క్తి.. వ్య‌స‌నాల‌కు బానిసైన ప‌ర్లయ్య అనే 50 ఏళ్ల వ్య‌క్తిని దారుణంగా చంపేసి.. ఆ డెడ్ బాడీని చెక్క పెట్టెలో పెట్టి.. తుల‌సి నిర్మాణం చేసుకుంటున్న ఇంటికి పంపించారు.

నిర్మాణంలో ఉన్న ఇంటికి డెడ్‌బాడీ వ‌స్తే.. అశుభం కాబ‌ట్టి..తుల‌సి ఆ ఆస్తిని వ‌దులుకుంటుంద‌ని.. తాము దానిని నొక్కేయాల‌ని రేవ‌తి, శ్రీధ‌ర్‌వ‌ర్మ‌లు ప్లాన్ చేశారు.కానీ, క‌థ అడ్డం తిరిగింది. తుల‌సి ఈ విష‌యాన్ని.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. వారం రోజులు క‌ష్ట‌ప‌డి.. ఈ కేసును ఛేదించారు. తొలుత ప‌ర్ల‌య్య ఆచూకీ ల‌భించ‌డంతో.. అక్క‌డి నుంచి వ‌రుస పెట్టి.. అన్ని విచార‌ణ‌లు చేసి.. శ్రీధ‌ర్ వ‌ర్మ‌ను మ‌చిలీప‌ట్నంలో అరెస్టు చేశారు. రేవ‌తిని ఆమె ఇంట్లోనే అరెస్టు చేశారు. అయితే.. రేవ‌తి మాత్రం త‌నకు శ్రీధ‌ర్ వ‌ర్మ‌కు సంబంధం లేద‌ని.. ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడ‌ని చెబుతున్నా.. ఆస్తికోసం.. భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ.. డెడ్‌బాడీ సీన్ క్రియేట్ చేశార‌ని ఎస్పీ అస్మీ తెలిపారు.

This post was last modified on December 28, 2024 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

1 hour ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

2 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

3 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

3 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

3 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

4 hours ago