రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా కాదంటే రూ.3వేలకు మించి ఖర్చు పెట్టాల్సి రావటం ఉండదు. ఒకవేళ వైరటీ కోసం బంగారం పౌడర్ ను కాస్త మేళవించినా రూ.లక్ష అవుతుందేమో. అంతకు మించి కాదు. కానీ.. రెండు పిజ్జాల కోసం రూ.8వేల కోట్లు ఖర్చు చేశారంటే.. షాక్ తినాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అని అనుకోవచ్చు.
కాకుంటే.. అవగాహన లేని వేళలో ఇలాంటి తప్పులే చేస్తారన్న భావన తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.ఈ మొత్తం ఇష్యూ గురించి తెలిసిన తర్వాత ప్రపంచంలో ఇంతకు మించిన దురదృష్టవంతుడు మరొకరు ఉండరనిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన లాస్లో హనిఎజ్ అనే వ్యక్తి 2010లో తన దగ్గర ఉన్న 10వేల బిట్ కాయిన్లను డాలర్లతో మార్చుకున్నాడు. దాంతో.. రెండు డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకొని తిన్నాడు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ విలువ ఎంతో తెలుసా? రూ.80 లక్షల కంటే ఎక్కువ. అంటే.. అతను మార్చుకున్న పది వేల బిట్ కాయిన్ల విలువ అక్షరాల రూ.8వేల కోట్లకు పైనే. అయితే.. బిట్ కాయిన్లు మొదట ప్రవేశ పెట్టినప్పుడు ఎవరూ వాటిని తీసుకోవటానికి ఆసక్తి చూపలేదు. దీంతో.. వాటి విలువ చాలా తక్కువగా ఉండేది. కాల క్రమంలో సంపన్నులు బిట్ కాయిన్ లో మదుపు చేయటం.. వాటికున్న ప్రత్యేక లక్షణాలతో వాటి విలువ ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయింది.
ప్రపంచంలో మరే చోట మదుపు చేసినా రాని రిటర్న్స్ బిట్ కాయిన్ లో మదుపు చేసిన వారి సొంతమైంది. తాజాగా లాస్లో హనిఎజ్ ఉదంతం తెలిసిన తర్వాత విస్మయానికి గురవుతున్నారు. ఐటీ ప్రోగ్రామర్ గా వ్యవహరించే అతను చేసిన పొరపాటు.. జీవితంలో సరిదిద్దుకోలేనంత భారీగా మారిందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. బిట్ కాయిన్ విషయానికి వస్తే 2010లో ఒక బిట్ కాయిన్ విలువ కేవలం 0.05 డాలర్లు మాత్రమే. మన రూపాయిల్లో చూస్తే కేవలం 2.29 రూపాయిలు మాత్రమే.
ఈ రోజున అదే ఒక బిట్ కాయిన్ విలువ రూ.80 లక్షలకు పైనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత బిట్ కాయిన్ విలువ మరింత భారీగా పెరిగింది. కొంతకాలం క్రితం తక్కువ ధరకు అందుబాటులో ఉన్న బిట్ కాయిన్ విలువ ఒక దశలో లక్ష డాలర్ల మార్కు దాటింది. ఇటీవల కాలంలో బిట్ కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ విజయం సాధించిన తర్వాత బిట్ కాయిన్ విలువ తగ్గటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
This post was last modified on December 25, 2024 11:31 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…