ఎవరి ఆహార అలవాట్లు వారివి. తమకు నచ్చిన వాటిని ఆకాశానికి ఎత్తేయటం తప్పేం కాదు. అదే సమయంలో తమకు నచ్చని వాటి విషయంలో మాటల్ని ఇష్టారాజ్యంలా కాకుండా ఆచితూచి అన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒక బ్రిటీష్ ప్రొఫెసర్ అనుసరించిన తీరు పెద్ద చర్చకు తెర తీయటమే కాదు.. ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్వీట్ల యుద్ధం సాగుతోంది. దక్షిణాది రాష్ట్రాల వారు అత్యంత ఇష్టంగా తినే ఇడ్లీ మీద సదరు బ్రిటీష్ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. అయితే.. ఇంత రచ్చకు ఒక ఫుడ్ సప్లై కారణం కావటం గమనార్హం. ఇంతకూ ఏం జరిగిందంటే..
మీరు ఇష్టపడే ఆహారాన్ని ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారంటూ ఒక ఫుడ్ ఐటెం పేరు చెప్పాలని కోరింది. అందుకు బ్రిటన్ కు చెందిన ఎడ్వర్డ్ అండర్సన్ అనే ప్రొఫెసర్ స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ విషయం ఇడ్లీ అని పేర్కొన్నారు. దీంతో.. ఇడ్లీ ప్రియులంతా భారీగా హర్ట్ అయ్యారు. ఇడ్లీ టేస్టును.. దానికుండే పోషక విలువలతో పాటు. దాని ప్రాధాన్యతను వివరిస్తూ .. సదరు ప్రొఫెసర్ మాటల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ యుద్ధంలో ఇడ్లీ ప్రియులైన సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు సీన్లోకి వచ్చేశారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మాజీ కేంద్రమంత్రి కమ్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విరుచుకుపడ్డారు. సదరు ప్రొఫెసర్ మాటపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇడ్లీ రుచిని అస్వాదించాలన్నా.. క్రికెట్ మ్యాచ్ ను ఎంజాయ్ చేయాలన్నా.. కేరళ డ్యాన్స్ అయిన ఒట్టంతుల్లాల్ ను చూడాలన్నా పెట్టి పుట్టాలని.. నిజమైన జీవితం ఏమిటో ఆయనకుతెలియనందుకు సదరు ప్రొఫెసర్ ను చూస్తే జాలేస్తుందన్నారు. ఇలా ఇడ్లీ ప్రియులంతా ఒక తాటి మీదకు వచ్చి.. సదరు బ్రిటీష్ ప్రొఫెసర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
తన మాటపై ఇంత భారీగా మాటల యుద్షం జరిగిన తర్వాత కూడా ఆయన తన తీరును మార్చుకోలేదు. తనను విమర్శిస్తున్న వారికి మరింత మంట పుట్టేలా ఆయన వ్యంగ్యంగా సారీ చెప్పి.. ఈ ఇష్యూను మరింత పెద్దది చేశారు. అనుకోకుండా తాను చేసిన తప్పును.. దైవదూషణకు సారీ అంటూ ఆయన ఎటకారం ఆడేశారు. లంచ్ కు ఇడ్లీనే ఆర్డర్ చేశానంటూ.. ఇడ్లీ ప్రియులకు ఎక్కడో కాలేలా చేశారు. చివర్లో తన వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తూ.. తన భార్యది కేరళ అని.. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టమన్న ఆయన.. ఇడ్లీ విషయంలో తన తీరు.. అభిప్రాయం ఏమీ మారలేదని తేల్చారు. దీంతో ఈ బ్రిటీష్ ప్రొఫెసర్ తీరుపై మరింత ఆగ్రహానికి కారణమైందని చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో ఈ ఇడ్లీ వార్ ఏ రూపు సంతరించుకుటుందో చూడాలి.
This post was last modified on October 12, 2020 12:25 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…