భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపింది. రెండుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.
ఈ ఓటమితో టీమిండియా పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి పడిపోయింది. ఈ సారి ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 59.26 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానానికి దిగజారిన భారత్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించడానికి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. శ్రీలంక (50 పీసీటీ) నాలుగో స్థానంలో నిలిచి భారత్‌కు పోటిగా ఉంది.
భారత్ మరో మూడు టెస్ట్ మ్యాచ్‌లను మాత్రమే ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లను గెలిస్తేనే 64.03 పాయింట్లతో ఫైనల్‌కి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమిని చూస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత జట్టు బయట పడుతుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు ఫలితాలు భారత్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టులను గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా కూడా తమ అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే 69 పాయింట్లతో ఫైనల్‌కి చేరే అవకాశాలు ఉంటాయి. ఇక భారత్ పైనే కాకుండా శ్రీలంక రూపంలో కూడా పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇండియా మిగతా టెస్టుల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకంటుందో చూడాలి.
This post was last modified on December 8, 2024 1:26 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…