#Babakadhaba.. నిన్నట్నుంచి ట్విట్టర్లో హల్‌చల్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ బాబా కా దాబా.. ఎందుకిది ట్రెండ్ అవుతోంది. తెలుసుకుందాం పదండి.
దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్‌లో 80 ఏళ్లు పైబడ్డ ఒక వృద్ధ జంట చిన్న హోటల్ నడుపుతోంది. 30 ఏళ్లకు పైగా వాళ్లు ఆ హోటల్ నడుపుతున్నారు. ఆ వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్లు ఆ చిన్న హోటల్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఐతే లాక్ డౌన్ కారణంగా ఆ హోటల్ మూతపడింది. కొన్ని నెలల తర్వాత తిరిగి హోటల్ తెరిచినా.. పెద్దగా వ్యాపారం జరగలేదు. దీంతో తమ దయనీయ స్థితి గురించి వివరిస్తూ ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
అంత పెద్ద వయస్కుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నెటిజన్ల గుండెలు తరుక్కుపోయాయి. సోనమ్ కపూర్ లాంటి కొందరు సెలబ్రెటీలు ఈ వీడియోను షేర్ చేశారు. అంతే.. కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వృద్ధ దంపతులను ఆదుకోవడానికి వేల మంది ముందుకొచ్చారు. కొందరు నేరుగా వెళ్లి డబ్బుల సాయం చేస్తే.. మరెంతో మంది ఆ హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వారికి తోడ్పాటు అందించాలనుకున్నారు.
దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న హోటల్ ఇప్పుడు రద్దీగా మారిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ జనం పోగయ్యారు. ఒక్కసారిగా పెరిగిపోయిన జనాల ఉద్ధృతితో ఒక పది మంది పనోళ్లను పెట్టుకుంటే తప్ప అందరికీ ఫుడ్ పెట్టలేని పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆ వృద్ధులకు వచ్చిన పాపులారిటీ, ఆదరణ చూస్తుంటే.. వాళ్లు ఇంక ఎప్పటికీ ఆదాయం గురించి బాధ పడాల్సిన పరిస్థితి ఉండదని స్పష్టమవుతోంది. సోషల్ మీడియా పవర్ ఏంటో.. దాన్ని సరైన దిశగా ఉపయోగించుకుంటే ఎంత మంచి జరుగుతుందో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ.
This post was last modified on October 8, 2020 9:59 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…