ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా వేలం చరిత్రలో అమ్ముడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డుపుటలకెక్కాడు. 13 ఏళ్ల ఈ టీనేజ్ కుర్రాడు క్రికెట్ దిగ్గజాల సరసన వేలం అమ్ముడై ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్లకు సూర్యవంశీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అది చిన్న వయస్కుడిగా ఓ రికార్డు క్రియేట్ చేసిన సూర్యవంశీ..తాజాగా వేలంలో సెలక్ట్ అయి మరో రికార్డు బద్దలు కొట్టాడు.
ఓ వైపు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో వంటి విధ్వంసకర అంతర్జాతీయ క్రికెటర్లు..దేవదత్ పడిక్కల్, పీయూష్ చావ్లా వంటి భారతీయ క్రికెటర్లు అమ్ముడుపోని తరుణంలో 13 ఏళ్ల ఈ యువ సంచలనం కోటి పది లక్షల రూపాయలకు అమ్ముడుపోవడం అంతర్జాతీయ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ టీనేజ్ టీ 20 విధ్వంసకర బ్యాట్స్ మన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడింది. చివరకు ఆర్ఆర్ అతడిని దక్కించుకుంది.
బీహార్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2024లో 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. బీహార్‌లోని ఓ మారమూల గ్రామానికి చెందిన వైభవ్ సూర్యవంశీ నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టి భళా అనిపించాడు. సూర్యవంశీ టాలెంట్ గుర్తించిన అతడి తండ్రి సంజీవ్ వెన్నుతట్టి ప్రోత్సహించాడు. వృత్తిరీత్యా రైతు అయిన సంజీవ్….సూర్యవంశీ కోసం ఇంటి పెరట్లో చిన్న ప్లే గ్రౌండ్ ను నిర్మించాడు.
9 ఏళ్ల వయసులో సమస్తిపూర్ లోని ఓ క్రికెట్ అకాడమీలో సూర్యవంశీని చేర్పించాడు. అలా అంచెలంచెలుగా ఎదిగిన సూర్యవంశీ…తాజాగా ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆల్రెడీ అండర్-19 ఆసియా కప్ కు సెలక్ట్ అయిన సూర్యవంశీ ఐపీఎల్ లోనూ ఆకట్టుకుంటే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టేందుకు ఎన్నో రోజుల పట్టదు. 13 ఏళ్లకే ఐపీఎల్ ఆడుతున్న ఈ యువ సంచలనం భవిష్యత్ సచిన్ అవుతాడేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on November 25, 2024 10:20 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…