Trends

తొందరలోనే ఫ్లోటింగ్ కాసినోలు

వైజాగ్ సముద్రజలాల్లో తొందరలోనే ఫ్లోటింగ్ కాసినోలు ప్రారంభమవుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. విశాఖపట్నానికి సమీపంలోని సముద్రంలో ఫ్లోటింగ్ కాసినోల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్రప్రభుత్వం కోరిందట. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. ఫ్లోటింగ్ కాసినోలు ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి అవసరం. కేంద్రం గనుక ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రంలో ఇదే మొదటి కాసినో అవుతుంది.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా రాష్ట్రప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఫ్లోటింగ్ కాసినోలు ప్రస్తుతం గోవాలో ఉన్నాయి. ఈ కాసినోల కారణంగా విదేశీయులు, దేశంలోని పలువురు ప్రముఖులు కూడా తరచూ గోవాకు వెళుతుంటారు. ఇక్కడ పోకర్, బ్లాక్ జాక్, రమ్మీ రూపంలో భారీ ఎత్తున జూదం నడుస్తంటుంది. ఇటువంటి జూదంలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ రంగాల్లోని ప్రముఖులు, వారి వారసులు ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటారు.

ప్రస్తుతం మన దగ్గర ఇటువంటి ఫ్లోటింగ్ కాసినోలు లేని కారణంగా మన రాష్ట్రం నుండి అనేకమంది రెగ్యులర్ గా గోవాతో పాటు శ్రీలంక, దుబాయ్, హాంగ్ కాంగ్, సింగపూర్, థాయ్ ల్యాండ్ లాంటి విదేశాలకు కూడా వెళుతుంటారని సమాచారం. మూడు లేదా ఐదంతస్తుల క్రూయిజ్ లేదా లేదా పెద్ద పెద్ద బోట్లలో ఇటువంటి కాసినోలు ఏర్పాటు చేస్తారు. ఇటువంటి కాసినోలు సముద్రంలో ఎక్కడో ఉంటాయి. వీటి దగ్గరకు మామూలు బోట్లలో జనాలను చేరుస్తారు. ఇటువంటి ఫ్లోటింగ్ కాసినోల్లోనే బస, వసతి సౌకర్యం కూడా ఉంటుంది.

కాసినోలకు కేంద్రప్రభుత్వం అనుమతిస్తే పోలీసుల రైడింగుల భయం ఉండదు. కాబట్టి నిర్భయంగా ఎన్ని రోజులైనా ఆడుకోవచ్చు. లాడ్జింగ్ , బోర్డింగ్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. కాబట్టి ఒకసారి కేంద్రం గనుక అనుమతిచ్చేస్తే రాష్ట్రప్రభుత్వంతో పాటు అందరు ఫుల్ హ్యాపీస్. ఈ ఫ్లోటింగ్ కాసినోలతో పాటు ఇతర క్రీడలైన ప్యారా గ్లైడింగ్, స్కూబా డైవింగ్, స్కీ బోటింగ్, జెట్ స్కీల్లాంటి వాటికి ఇప్పటికే అనుమతులున్నాయి. కాబట్టి కేంద్రం గనుక కాసినో ఏర్పాటుకు అనుమతిచ్చేస్తే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అనుకుంటున్నారు. చూద్దాం దీని కారణంగా ఏమాత్రం ఆదాయం పెరుగుతుందో.

This post was last modified on October 5, 2020 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

3 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago