తన కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిని, ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ డిమాండ్లకు తగ్గట్లు ఆడలేక రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్‌కు పరిమితం అయిన అతడికి.. ఇక్కడా పరిస్థితులు అనుకూలించడం లేదు. రిటైర్మెంట్‌తో బరువు దించేసుకున్న అతను.. ఐపీఎల్‌లో తన సత్తా చూపిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పట్లేదు.
ఓవైపు చెన్నై జట్టు ఆశించిన ప్రదర్శన చేయట్లేదు. మరోవైపు వ్యక్తిగతంగా ధోని కూడా రాణించలేకపోతున్నాడు. దీంతో అభిమానులకు మునుపెన్నడూ చూడని విధంగా నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాడు ధోని. శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్-చెన్నై మ్యాచ్‌లో అది స్పష్టంగా కనిపించింది. ఇంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంతిని సరిగా హిట్ చేయలేక, వేగంగా ఆడలేక ధోని ఇబ్బంది పడ్డాడు. దీనికి తోడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయింది చెన్నై.
ఐతే తర్వాతి మ్యాచ్‌లో చెన్నై బలంగా పుంజుకుంటుందని, ధోని కూడా ఊపందుకుంటాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సన్‌రైజర్స్ చేతిలో చెన్నై ఓడిపోయింది. ధోని మరోసారి హిట్టింగ్ చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత మ్యాచ్‌ల్లో మాదిరే ముందు బంతులు వృథా చేసి చివర్లో హిట్ చేసే ప్రయత్నం చేశాడు. అది వర్కవుట్ కాలేదు. ధోని ఒంట్లో ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. చాలా అలసిపోయినట్లు, ఫిట్‌నెస్ దెబ్బ తిన్నట్లుగా అగుపించాడు. వికెట్ల మధ్య పరుగు తీయలేక ఆయాసపడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా చూసి ధోని పనైపోయిందని, అతను వేస్ట్ అని కొందరు తేలిగ్గా తీసిపడేస్తున్నారు. ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు. ధోనీని ట్రోల్ చేస్తున్నారు.
కానీ ఏడాదికిపైగా విరామం తర్వాత, పెద్దగా ప్రాక్టీస్ లేకుండా ధోని ఐపీఎల్‌లోకి వచ్చిన సంగతి మరువరాదు. అతను 40వ పడిలో ఉన్న సంగతీ గుర్తుంచుకోవాలి. శుక్రవారం మ్యాచ్ విషయానికి వస్తే.. 20 ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. తర్వాత 14 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. టైమింగ్ కుదరక షాట్లు ఆడలేకపోయాడు. ఇప్పుడు అంచనాలకు తగ్గట్లు ఆడనంత మాత్రాన అతడి గతాన్ని మరిచిపోయి తిట్టేయడం ఎంతమాత్రం సరికాదు. ఇది ఫ్రాంఛైజీ క్రికెట్. తమకు అవసరం లేదనుకుంటే సీఎస్కేనే ధోనీని తప్పించేస్తుంది. కాబట్టి ధోని విషయంలో జనాలు ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరమైతే లేదు.
This post was last modified on October 3, 2020 3:33 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…