ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 వచ్చే ఏడాది మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఓజితో పోల్చుకుంటే దాని స్థాయి బజ్ ఈ సినిమాకు లేదు కానీ ప్రమోషన్ల ద్వారా దాన్ని ప్రణాళికాబద్ధంగా పెంచేందుకు నిర్మాత ఏఎం రత్నం పక్కా ప్లానింగ్ తో ఉన్నారు.
బ్యాలన్స్ ఉన్న కొంత భాగాన్ని పూర్తి చేసే పనిలో దర్శకుడు జ్యోతికృష్ణ బిజీగా ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ తదితర కీలక వ్యవహారాలకు క్రిష్ జాయినవుతారని సమాచారం. మ్యూజిక్ పరంగా ఎంఎం కీరవాణి పవర్ స్టార్ కాంబినేషన్ మీద భారీ అంచనాలున్నాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ హరిహర వీరమల్లుకి పలు మార్గాల్లో పోటీ గట్టిగానే ఉండబోతోంది. మోహన్ లాల్ ఎల్2 ఎంపూరన్ (లూసిఫర్ సీక్వెల్) అధికారికంగా మార్చి 27 డేట్ ప్రకటించుకుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది. సల్మాన్ ఖాన్ సికందర్ సైతం మార్చి 28 వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే రోజు ప్లాన్ చేసుకున్న విజయ్ దేవరకొండ 12 వాయిదా పడే సూచనలున్నాయి. ఒకవేళ వీరమల్లు మళ్ళీ మనసు మార్చుకుంటే విడి 12 చెప్పిన టైంకి దిగుతాడు.
ఎలా చూసుకున్నా హరిహరవీరమల్లు సోలోగా రావడం జరగని పనిలా కనిపిస్తోంది. టీజర్ తప్ప ఇప్పటిదాకా ఫుల్ లెన్త్ పబ్లిసిటీ ఇంకా మొదలుపెట్టలేదు. త్వరలోనే పాటతో ప్రారంభిస్తారని తెలిసింది. బడ్జెట్ ఇప్పటికే తడిసి మోపెడవ్వడంతో నిర్మాత భారీ రిలీజుకి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఓజి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ కి దీని పట్ల ఆసక్తిని బాగా పెంచగలిగితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఎలాగూ థియేటర్ల సమస్య, టికెట్ రేట్ల పెంపు లాంటి ఇబ్బందులు ఉండవు కనక రికార్డులను సులభంగా ఆశించవచ్చు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారిక్ డ్రామాలో బాబీ డియోల్ ఔరంగజేబుగా కనిపించనున్నాడు.
This post was last modified on November 3, 2024 4:12 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…