ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మ్యాచ్‌లు జరుగుతుండగా, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొన్నటి వరకు నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి ర్యాంక్ అందుకోవడానికి ఎంతో ధూరంలో లేడని అనుకుంటున్న టైమ్ లో ఊహించని షాక్ ఎదురయ్యింది. పూణే టెస్టులో న్యూజిలాండ్‌పై విఫలమైన జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి 3వ స్థానంలో నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లతో రాణించిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని సాధించాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ జాష్ హేజిల్‌వుడ్ రెండవ స్థానంలో ఉన్నాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రెండో టెస్టులో 5 వికెట్లు తీసినా, 2వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకుకు పడిపోయాడు.
రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక రెండు ర్యాంకులు కోల్పోయి 8వ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ప్రవేశించి, 9వ ర్యాంకులో నిలవడం గమనార్హం.
టాప్-10 టెస్ట్ బౌలర్ల లేటెస్ట్ ర్యాంకింగ్స్
This post was last modified on October 30, 2024 6:30 pm
రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో…
గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…
బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…
వైసీపీ అధినేత జగన్ వ్యవహారం.. మరోసారి ఢిల్లీ వరకు చేరిందా? ఆయనపై బీజేపీ అగ్రనేత ఒకరు సీరియస్ కామెంట్లు చేశారా?…
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…