సచిన్ టెండుల్కర్ దేశంలోనే అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో ఒకడు. క్రికెట్లో ఎనలేని పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు సంపాదించుకుని అతను నిష్క్రమించాడు. ఆట నుంచి రిటైరయ్యాడో లేదో వెంటనే దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నను కూడా దక్కించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి పిల్లల గురించి ఏదైనా వార్త రాసేముందు మీడియా వాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు. ఊరికే రూమర్లు పుట్టించి ప్రచారం చేయరు.
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆటలో ఆశించిన ప్రతిభ చూపించలేదు. కనీసం రంజీ, ఐపీఎల్ స్థాయికి కూడా ఎదగలేదు. అయినా సరే.. అతడి గురించి మీడియాలో ఏ నెగెటివ్ న్యూస్ కనిపించదు. ఇక సచిన్ కూతురు సారా గురించి ఎప్పుడూ మీడియాలో వార్తలు రాలేదు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆమె ప్రేమ వ్యవహారం గురించి నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో కొంత చర్చ నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా డేటింగ్ చేస్తోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శుభ్‌మన్ కొన్నేళ్లుగా భారత క్రికెట్లో చర్చనీయాంశంగా ఉంటున్నాడు. రెండేళ్ల కిందట అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతను సభ్యుడు. టోర్నీలో తిరుగులేని ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చాడు కానీ.. ఆశించిన మేర సత్తా చాటలేదు. ఐతే దేశవాళీల్లో సత్తా చాటాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మంచి అంచనాలతో బరిలోకి దిగి చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు.
అతనంటే సారాకు చాలా ఇష్టమని.. శుభ్‌మన్‌తో ఆమెకు పరిచయం ఉందని.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. ఇరువురూ కొంత కాలం ప్రయాణం చేయాలనుకుంటున్నారని.. ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేయడానికి ఇరువురి కుటుంబాలకు కూడా అభ్యంతరం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సచిన్ ఏదైనా పెద్ద వ్యాపార కుటుంబం చూసి సారాకు పెళ్లి చేస్తాడేమో అని ముందు అనుకున్నారు కానీ.. భారత క్రికెట్లో మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, నడవడిక కూడా బాగుంది, అందగాడు కూడా.. అన్నింటికీ మించి సారాకు నచ్చితే పెళ్లి చేయడానికి అతడికి అభ్యంతరం లేకపోవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 1, 2020 3:11 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…