ఈసారి ఐపీఎల్ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్ నుంచి తరలిపోతే పోయింది కానీ.. మజాకు మాత్రం లోటు లేదు. గత సీజన్లన్నింటినీ మించి ఈసారి లీగ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. హోరాహోరీ, ఉత్కంఠభరిత పోరాటాలు, అనూహ్య ఫలితాలతో యమ రంజుగా సాగుతోంది టోర్నీ. ఏ జట్టునూ ఫేవరెట్ అని చెప్పుకునే పరిస్థితి లేదు.
ఒక మ్యాచ్‌లో అదరగొట్టే జట్టు.. తర్వాతి మ్యాచ్‌లో అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఒక మ్యాచ్‌లో వేస్ట్ అనిపించే టీం ఇంకో మ్యాచ్‌లో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్‌ను టోర్నీ ఆరంభానికి ముందు అందరూ తీసిపడేశారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో సంచలన ప్రదర్శనతో మంచి ఊపు మీద కనిపించిన చెన్నై, పంజాబ్ జట్లను ఓడించింది. ఇక బుధవారం కోల్‌కతాతో మ్యాచ్‌లో రాయల్స్‌ను అందరూ ఫేవరెట్‌గా పరిగణిస్తే.. కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడింది.
ఈ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ గురించి చెప్పుకోవాలి. తొలి మ్యాచ్‌లో ముంబయి జట్టు చెన్నై చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఆ చెన్నై జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఆపై ఢిల్లీ ఏమో సన్‌రైజర్స్ చేతిలో ఓడింది. ఈ సన్‌రైజర్స్ జట్టు అంతకుముందు బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఆ బెంగళూరు దానికంటే ముందు పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. పంజాబ్ ఏమో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్థాన్ చూస్తే ఇప్పుడు కోల్‌కతాకు తలవంచింది. కోల్‌కతా అంతకుముందు ముంబయి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ముంబయితో మొదలై ముంబయితో ముగిసిన ఈ సైకిల్ గమనిస్తూ ఐపీఎల్ ఎంత అనూహ్యంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీలో ఫేవరెట్లు అంటూ ఎవరూ లేరని.. మున్ముందు కూడా ఎన్నో హోరాహోరీ పోరాటాలు, అనూహ్య ఫలితాలు చూడబోతున్నామని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on October 1, 2020 12:29 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…