ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్నింట్లోకి నెట్ ఫ్లిక్స్ రేంజి వేరు. మిగతా ఓటీటీలు ఎక్కువగా సినిమాల మీదే ఆధారపడతాయి కానీ.. నెట్ ఫ్లిక్స్ సొంత సిరీస్‌లతో ఎప్పుడూ తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటుంది. ఆ సంస్థ నిర్మించే ఒరిజినల్స్‌లో క్వాలిటీ ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ల మీద రోజుకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతుందని ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఇటీవల వెల్లడించాడు. దీన్ని బట్టి వాళ్ల రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెబ్ సిరీస్‌ల విషయంలో నెట్ ఫ్లిక్స్‌కు ఉన్న గుడ్ విల్‌యే వేరు. వాళ్ల నుంచి ఓ సిరీస్ వచ్చిందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని భావిస్తారు.
ఆ నమ్మకంతోనే ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ పేరుతో వచ్చిన హిందీ సిరీస్‌ను ఆసక్తిగా చూశారు ప్రేక్షకులు. నిన్ననే అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ చూశాక నెట్ ఫ్లిక్స్ మీద బూతుల వర్షం కురుస్తోంది.
‘నెట్ ఫ్లిక్స్’ చరిత్రలోనే అత్యంత చెత్త కంటెంట్ ఉన్న సిరీస్ ఇదే అంటూ నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. తమ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ మండిపడుతున్నారు. గతంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘జోకర్’ అనే చెత్త సినిమా తీసిన శిరీష్ కుందర్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ‘జోకర్’ చూసిన జనాలకు అప్పట్లో ఏ రేంజిలో శిరీష్ మీద ఫైర్ అయ్యారో తెలిసే ఉంటుంది.
ఈ ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ దాన్ని మించి న చెత్త అంటూ నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఇది చూశాక నెట్ ఫ్లిక్స్ మీద ఉన్న నమ్మకమే పోయిందని అంటున్నారు. మొదలైన 15 నిమిషాల నుంచి ప్రేక్షకులకు చుక్కలు చూపించేస్తోందట ఈ సిరీస్. అసలు కథంటూ ఏమీ లేకుండా.. చెత్త సీన్లతో సిరీస్‌ను నింపేశారంటున్నారు.
మనోజ్ బాజ్‌పేయి లాంటి నటుడు ఇందులో ఎలా నటించాడని ప్రశ్నిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటన గురించి ఏకిపడేస్తున్నారు. సిరీస్ ఆరంభంలో ‘టార్చర్ అంటే మీకు తెలియదు. ఇకపై చూస్తారు’ అంటూ జాక్వెలిన్ నోట ఓ డైలాగ్ వస్తుంది. ఇది ఈ సిరీస్‌ను ఉద్దేశించి పెట్టిందే అని.. ఆ హెచ్చరిక చూడగానే తర్వాత చూడటం ఆపేయాల్సిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on May 2, 2020 1:41 pm
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…