సుక్కు-బన్నీ డబుల్ ధమాకా?

సుక్కు-బన్నీ డబుల్ ధమాకా?

'రంగస్థలం' తర్వాత సుకుమార్ మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఐతే ఆయన సినిమాల తరహాలోనే కొత్త చిత్రం పట్టాలెక్కే విషయంలో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబుతో అనుకున్న సినిమా కాస్తా.. అల్లు అర్జున్‌కు మారింది.

మహేష్ కోసం తయారు చేసిన కథనే బన్నీకి తగ్గట్లుగా మార్చి ఈ సినిమా తీయబోతున్నాడు సుక్కు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం చుట్టూ తిరిగే కథ అని సమాచారం. సినిమా 'రా'గా.. రస్టిగ్గా ఉంటుందని అంటున్నారు. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అంశాలకు లోటుండదట. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. కథ చాలా పెద్దదిగా వచ్చిన నేపథ్యంలో 'బాహుబలి' స్టయిల్లో రెండు భాగాలుగా ఈ సినిమా తీసే ఉద్దేశంలో ఉన్నాడట సుక్కు.

ఈ కథ మీద దాదాపు ఏడాదిగా పని చేస్తున్నాడు సుక్కు. ఎర్రచందనం మీద ఆయన అపారమైన పరిశోధన జరిపారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర అంశాలు తెలిశాయట. పదుల సంఖ్యలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు స్క్రిప్టులోకి వచ్చి చేరాయట. వాటన్నింటినీ ఒక్క సినిమాలో చూపించడం కష్టమని.. కథ విస్తృతి కూడా పెరిగిందని.. ఈ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తీయాలని అనుకుంటున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం.

ఒక దశలో తన దగ్గరున్న అదనపు సమాచారాన్ని అసిస్టెంట్లకు ఇచ్చి వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన కూడా చేశాడు సుక్కు. దీని కోసం అమేజాన్ సంస్థతో చర్చలు కూడా జరిపాడు. కానీ తర్వాత ఆయన ఆలోచన మారింది. ఇంకో సినిమా తీయగలిగే స్టఫ్ ఉంది, బన్నీ కూడా నో చెప్పే అవకాశం లేదు. అందుకే రెండు భాగాలుగా సినిమా తీయాలని డిసైడయ్యాడట సుక్కు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చేశాడట. ఇంకో నెల రోజుల్లోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English