ఆ తొమ్మిదీ.. ఈ తొమ్మిదీ

ఆ తొమ్మిదీ.. ఈ తొమ్మిదీ

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన.. అని చంద్రబాబు పేరు ప్రస్తావనకు ముందు చెప్పుకోవడం జరుగుతున్నది. తొమ్మిదో సంఖ్య చంద్రబాబుకి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకమైనది. పదవి పోగొట్టుకుని చంద్రబాబుకి తొమ్మిదేళ్ళయ్యింది. దాంతోపాటుగా టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. తొమ్మిదిని లక్కీ నెంబర్‌ అంటారు. ఎందుకంటే సింగిల్‌ నెంబర్స్‌లో తొమ్మిది పెద్దది కావున. అలా చంద్రబాబుకి లక్కీ నెంబర్‌ 9 కలిసొస్తే రాజకీయాల్లో ఆయన కష్టాలు తొలగవచ్చును.

తొమ్మిదేళ్ళ వనవాసం (ప్రతిపక్షంలో కూర్చోవడం) అనంతరమైనా చంద్రబాబుకి రాజ్యాధికారం (ముఖ్యమంత్రి పదవి) దక్కుతుందేమో చూడాలిక. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలైతే అధికారం తమదేనన్న ధీమతో కనిపిస్తున్నారు. మహానాడు ఇచ్చిన ఉత్సాహం ఎన్నికలదాకా ఉంచుతామనే ధీమా వారిలో కనిపిస్తున్నది. ఈ వేడి 2014 వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు