కేసీఆర్ ఎందుకు టీడీపీ పొత్తు వ‌ద్ద‌న్నాడు?

కేసీఆర్ ఎందుకు టీడీపీ పొత్తు వ‌ద్ద‌న్నాడు?

ఈరోజు ల‌గ‌డ‌పాటి ఒక సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. కేటీఆర్ స‌ర్వేలో విష‌యంలో ల‌గ‌డ‌పాటిని సాయం అడిగాడ‌ట‌. ఆ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లో ల‌గ‌డ‌పాటి కేటీఆర్‌కు ఒక స‌ల‌హా ఇచ్చార‌ట‌. అదేంటంటే... చంద్ర‌బాబును వ‌దులుకోవ‌ద్దు. అవ‌కాశం ఉంటే ఆయ‌నతో పొత్తు పెట్టుకోండి. అది మీకు లాభిస్తుంది... అని చెప్పార‌ట‌. అయితే దానికి కేసీఆర్ ఆస‌క్తిగా లేర‌ని టీడీపీతో పొత్తు వ‌ద్ద‌నుకున్నార‌ని, కేటీఆర్ చెప్పిన‌ట్లు ల‌గ‌డ‌పాటి వివ‌రించారు. అయితే, ఇక్క‌డ ఆస‌క్త‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే... ఎందుకు కేసీఆర్ టీడీపీతో పొత్తు వ‌ద్ద‌నుకున్నాడు?

కేసీఆర్‌కు స‌న్నిహితంగా మెలిగే ఓ నాయ‌కుడు దీనిపై ఒక ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. తెలంగాణ‌లో ఉన్న పార్టీలలో కాంగ్రెస్‌, బీజేపీ, తెలంగాణ జ‌న స‌మితి, క‌మ్యూనిస్టు పార్టీలు ముఖ్య‌మైన‌వి. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు-బీజేపీకి చెడింది. తెలంగాణ స‌మితితో పొత్తు పెట్టుకోవ‌డానికి చంద్ర‌బాబుకు ఆస‌క్తి ఉన్నా కోదండ‌రాం ఒప్పుకోడు. క‌మ్యూనిస్టు పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నా దానివ‌ల్ల టీడీపీకి గాని, ఆ పార్టీల‌కు గాని ఒరిగేదేం ఉండ‌దు. ఇక మిలింది కాంగ్రెస్‌. తెలుగుదేశం పుట్టిందే పుట్టిందే కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా కాబ‌ట్టి ఆ పార్టీతో చంద్ర‌బాబే పొత్తుకు ఒప్పుకోడు. దీంతో చంద్ర‌బాబు ఒంట‌రి అవుతాడు. పైగా ముంద‌స్తుకు వెళ్ల‌డం ద్వారా ఆయ‌నకు టైం కూడా ఉండ‌దు. ఇది జ‌రిగితే... తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల ఓట్ల‌న్నీ చీలిపోతాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు కూడా బాగా చీలిపోతుంది. దీనివల్ల చివ‌ర‌కు టీఆర్ఎస్ లాభ‌ప‌డుతుంది...అని కేసీఆర్ విశ్లేషించార‌ట‌. పైగా పొత్తుకు వెళ్తే సీట్లు పంచాలి. ఎలాగూ ఎంఐఎం పోనూ మ‌న‌కు 112 సీట్లున్నాయి కాబ‌ట్టి ఇబ్బంది ఉండ‌దు అనుకున్నార‌ట‌.

కానీ... రాజ‌కీయ చాణ‌క్యుడైన చంద్ర‌బాబు వ్యూహాల‌ను అంచ‌నా వేయ‌డంలో కేసీఆర్ అతిదారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. కేసీఆర్ క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా చంద్ర‌బాబు-కాంగ్రెస్ ఒక్క‌ట‌య్యాయి. మొద‌ట్లో ఊహాగానాలు వ‌చ్చిన‌పుడు టీఆర్ఎస్‌లో ఇత‌రులు భ‌య‌ప‌డినా కేసీఆర్ కొట్టిపారేశార‌ట‌. ఎందుకంటే... అది నిల‌బ‌డ‌దు. వ్య‌తిరేక‌త వ‌స్తుంది, బాబు వెన‌క్కు త‌గ్గుతారు అని త‌న ముఖ్య శ్రేణుల‌తో అన్నార‌ట‌. అందుకే ఆ కూట‌మి ఏర్ప‌డి జ‌నం యాక్సెప్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ మొహం మాడిపోయింది. అంత‌కుముందు ఎంతో ఉత్సాహంతో క‌నిపించే కేసీఆర్ మొహంలో నెత్తురుచుక్క లేదు. దిగాలు. ఫ్ర‌స్త్రేష‌న్‌. అందుకే తొలి రెండు మూడు స‌భ‌లో పొత్తు విక‌టించేలా చేయ‌డానికి చంద్ర‌బాబును దారుణంగా దూషించాడు. దానికి కాంగ్రెస్ వాళ్లు భ‌య‌ప‌డి వెన‌క్కు త‌గ్గుతారేమో అని కేసీఆర్ చివ‌రి ప్ర‌య‌త్నం చేశారు. అది కూడా విఫ‌ల‌మైంది. ఆరోజు నుంచి ఈరోజు వ‌ర‌కు కేసీఆర్ మొహంలో న‌వ్వు మాయ‌మంది. కూట‌మి విజ‌య‌వంతం అయ్యింది. ఎన్న‌డూ లేనట్టు ఏ గొడ‌వ‌లూ లేకుండా సీట్లు పంచుకున్నారు. చివ‌ర‌కు విజ‌య తీరాల‌కు చాలా స‌మీపానికి వ‌చ్చారు. ఏమైనా చంద్ర‌బాబు వ్యూహాల‌ను అంచ‌నా వేయ‌డం తెలివిగా మాట్లాడినంత సులువు కాదు.

ఇక చంద్ర‌బాబు టీడీపీ శ్రేణుల‌ను ఈ పొత్తు ఒప్పించ‌డానికి ఒకటే నినాదంతో ముందుకు పోయార‌ట‌. *భ‌విష్య‌త్తు కోసం భ‌రించండి* అన్న‌దే ఆ నినాదం. చివ‌ర‌కు ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియ‌దు గాని బాబు స‌భల‌కు స్పంద‌న చూస్తుంటే పార్టీ తెలంగాణ‌లో పూర్వ వైభ‌వం తెచ్చ‌కుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English