ఆమె పోస్ట్‌ చేస్తే వ‌చ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాకే!

ఆమె పోస్ట్‌ చేస్తే వ‌చ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాకే!

ఇవాళ‌.. రేప‌టి రోజున సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌టం అదో అల‌వాటుగా మారింది. అంత‌కు మించి దిన‌చ‌ర్య‌గా మారింది. సామాన్యుల మొద‌లు సెల‌బ్రిటీల వ‌ర‌కూ ట్విట్ట‌ర్‌.. ఫేస్ బుక్‌.. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండేవారు బోలెడంత‌మంది క‌నిపిస్తారు.

ట్వీట్ల‌కు.. ఫేస్ బుక్ లో పోస్టుల‌కు.. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల‌ను పెడితే.. వ‌చ్చే రెస్పాన్స్ కు.. అమెరికాకు చెందిన ప్ర‌ముఖ  గాయ‌ని.. న‌టి సెలీనా గోమేజ్ పెట్టే ఫోటోల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌ద‌ట‌. ఆమె ఒక్క‌టంటే ఒక్క ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అక్ష‌రాల రూ.24.75 కోట్ల మొత్తం ఆమె అకౌంట్లో చేరిపోతాయ‌ట‌. ఎందుకంటే.. ఆమెకున్న‌క్రేజ్ అలాంటిద‌ని చెబుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్‌లో సెలీనాకు ఉన్న ఫాలోవ‌ర్స్ 141.5 మిలియ‌న్లు (141 కు 10 ల‌క్ష‌ల చొప్పున హెచ్చ‌వేయండి.. దిమ్మ తిరిగే ఫిగ‌ర్ వ‌స్తుంది) ఉన్నారు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు.. వీడియోల‌కు అభిమానుల నుంచి వ‌చ్చే స్పంద‌న అలా ఇలా ఉండ‌ద‌ట‌. ఒక్క పోస్ట్ పెడితే ల‌క్ష‌ల్లో లైకులు.. కామెంట్లు పెడుతుంటార‌ట‌. మ‌రి.. అంత‌టి పాపులార్టీ ఉన్న ఆమె ఖాతా నుంచి త‌మ ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన ఒక్క ఫోటో పెడితే.. భారీ మొత్తాన్ని ఇవ్వ‌టానికి కంపెనీలు సిద్ధంగా ఉండ‌వా ఏంటి?

సెలీనాకు ప్ర‌ముఖ జ‌ర్మ‌న్ కంపెనీ అయిన ప్యూమాకు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ బ్రాండ్‌కు చెందిన ప్ర‌తి పోస్ట్ కు ఆమెకు రూ.24.75 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా ఇస్తుంటారు. అందుకే.. ఫ్యూమా బ్రాండ్‌కు చెందిన దుస్తులు.. షూస్ వేసుకొన్న ఫోటోల్ని ఆమె షేర్ చేస్తుంటారు. అయితే.. త‌న‌కొచ్చే పారితోషికంలో ఎక్కువ భాగాన్ని ఒక రీసెర్చ్ సంస్థ‌కు ఇస్తుంటార‌ని చెబుతారు.

రెండేళ్ల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధికి సెలీనా గుర‌య్యారు. ఆమెకు చెందిన రెండు కిడ్నీలు చెడిపోవ‌టంతో ఆమె స్నేహితురాలు ఒక కిడ్నీని ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో కిడ్నీ సంబందిత వ్యాధికి సంబంధించిన ప‌రిశోధ‌న‌ల కోసం.. త‌న‌లా వ్యాధి సోకిన వారికి సాయం చేసేందుకు ఆమె భారీగా నిధులు విరాళంగా అందిస్తుంటారట‌. సంపాదించిన మొత్తాన్ని సెలీనా ఖ‌ర్చు చేసే వైనం ఫిదా అయ్యేలా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు