కేసీఆర్ ప్లాన్ బీః రెండు స్థానాల నుంచి పోటీ

కేసీఆర్ ప్లాన్ బీః రెండు స్థానాల నుంచి పోటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న ఎత్తుగ‌డ‌ల‌కు ప‌దును పెడుతున్నారా?  రాబోయే ఎన్నిక‌ల‌ను ఆయ‌న మ‌రింత విభిన్నంగా ఎదుర్కోనున్నారా?గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చిన ఎత్తుగ‌డ‌తో ఈ ద‌ఫా కాంగ్రెస్ నేత‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశం నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో కేసీఆర్ పోటీ గురించి ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. ఉత్త‌ర తెలంగాణ‌లో స‌త్తా చాటిన కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో ద‌క్షిణ తెలంగాణ‌లో అడుగుపెట్ట‌నున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌ను ఎదుర్కోవ‌డమే ల‌క్ష్యంగా ఆయ‌న ఈ ఎత్తుగ‌డ వేసిట్లు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో  కేసీఆర్ ఎక్క‌డినుంచి పోటీ చేయ‌నున్నార‌నే చ‌ర్చ‌లోకి అనూహ్యంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా తెర‌మీద‌కు వ‌చ్చింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పినేత జానారెడ్డి, సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంట్‌ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లాంటి ముఖ్య నేతలంతా ఉమ్మడి నల్గొండలోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో నల్గొండలోని ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్‌  పోటీచేస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపవచ్చుననే ఆలోచనతో ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు గురి పెట్టినట్లు ప్ర‌చారం జ‌రిగింది. నల్లగొండ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ బ‌లంగా ఉన్న ఈ జిల్లాలో పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి జ‌గదీశ్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నార‌ని, ఆ పార్టీకి చెందిన నాయ‌కుల‌ను ఎదుర్కోవ‌డంలో స‌త్తా చాట‌డం లేద‌నే భావ‌న కేసీఆర్‌లో ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌నే బ‌రిలో దిగడం ద్వారా ఉత్త‌ర తెలంగాణ వంటి సానుకూల వాతావ‌ర‌ణాన్ని ద‌క్షిణ తెలంగాణ‌లో కూడా పాదుకొల్పాల‌ని ఆయ‌న యోచిన‌స్తున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్‌తో పాటుగా రాబోయే ఎన్నిక‌ల్లో న‌ల్లగొండలోని ఏదైనా ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచిబ‌రిలోకి దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. గ‌జ్వేల్‌లో గెలుపు ఖాయ‌మ‌ని ధీమాతో ఉన్న గులాబీ ద‌ళ‌ప‌తి..మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో కాస్త శ్ర‌మిస్తే గెల‌వ‌గ‌ల‌న‌నే భావ‌న‌తో ఉన్న‌ట్లు పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English