అనుపమ-సావిత్రి.. పిచ్చి పీక్స్!!

అనుపమ-సావిత్రి.. పిచ్చి పీక్స్!!

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది.. జీవించింది లాంటి పదాలకు మించి మరొక పదం ఏదైనా వెతకాలి. అంతగా మహానటి పాత్రను మెప్పించిన కీర్తి.. సావిత్రే దిగొచ్చి నటించిందా అనిపించేలా మెప్పించింది.

ఇది కీర్తి సురేష్ ఫ్యూచర్ కు బాగా కలిసొచ్చే విషయం గానే చెప్పాలి. నటనలో తన ప్రతిభను అద్భుత స్థాయిలో ప్రదర్శించడం అభిమానులను కచ్చితంగా అలరించే విషయమే. అయితే.. ఈమెకు కీర్తికి కాంపిటీటర్లలో ఒకరైన అనుపమా పరమేశ్వరన్ అభిమానులు కూడా తెగ యాక్టివ్ అయిపోతున్నారు. సావిత్రితో నవ్వులను.. చిలిపిదనాన్ని.. ఫీలింగ్స్ ను.. అన్నిటినీ పోల్చుతూ రకరకాల పోస్టర్లను తయారు చేస్తున్నారు అనుపమ ఫాలోయర్స్. ఇలా అభిమానులు ఇలాంటి కొలేజ్ లు తయారుచేయడం ఒక లెక్క అయితే..  వాటిని అనుపమ పరమేశ్వరన్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసేసుకుని తెగ మురిసిపోతుంది.

నవ్వులు-నవ్వులు.. దండాలు-దండాలు.. పోలినంత మాత్రాన.. ఏకంగా తను కూడా సావిత్రిలా ఫీలయిపోతోందా అన్నదే అర్ధం కాని విషయం. ఈ షేరింగులు గట్రూ చూస్తుంటే.. పిచ్చి పీక్స్ అనే ఫీలింగ్ అయితే రావడం ఖాయం. కానీ ఎన్నేసి ఫోటోలను పోస్ట్ చేసినా.. కొన్నేళ్ల వరకూ మహానటి అన్నా.. సావిత్రి అన్నా కీర్తి సురేష్ చేసిన నటనే గుర్తొస్తుంది తప్ప.. అనుపమను గుర్తు తెచ్చుకోవడం సాధ్యమేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English