మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారా..? పార్టీ పెడతారా?

మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారా..? పార్టీ పెడతారా?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం కొత్త ప్రొఫెషన్లోకి మారేందుకు అంతా సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ప్రస్తుతం  ప్రజా సమస్యలను అధ్యయనం చేయడంలో బిజీగా ఉన్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి.

    ప్రకాశం జిల్లా చీరాల పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన, రైతుల సమస్యలు తీరే సమయం దగ్గరకొచ్చిందని వ్యాఖ్యానించారు. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే టైమొచ్చిందని అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే తన లక్ష్యమని వెల్లడించారు. లక్ష్మీ నారాయణకు తమ సమస్యలు ఏకరవు పెట్టిన రైతులు, పంటలను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హోల్ సేల్ వ్యాపారులకు తాము పంటను విక్రయిస్తుంటే, తమకు తక్కువ ధర ఇచ్చి, బహిరంగ మార్కెట్ లో దళారులు అధిక ధరలతో వాటిని ప్రజలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు.

    లక్ష్మీనారాయణ కొద్దిరోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలోనూ విస్త్రతంగా పర్యటించి అక్కడి ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. అందులోభాగంగానే ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారని వినిపిస్తోంది. అందుకుతగ్గట్లుగానే ఆయన తాజాగా ‘నా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే టైమొచ్చింది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన ఏదైనా పార్టీలో చేరుతారా? లేదంటే సొంతంగా పార్టీ పెడతారా అన్నది తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English