అత‌డేనా.. మోడీ లేటెస్ట్ ఏపీ ఇన్ ఫార్మ‌ర్?

అత‌డేనా.. మోడీ లేటెస్ట్ ఏపీ ఇన్ ఫార్మ‌ర్?

ఏపీ రాజ‌కీయాల్లో.. ఆ మాట‌కు వ‌స్తే తెలుగు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడో ఆస‌క్తిక‌ర అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎవ‌రిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ధాని మోడీకి.. ఏపీకి చెందిన కీల‌క నేత స‌న్నిహితుడు ఒక‌రు స‌న్నిహితంగా మార‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సొంత పార్టీ నేత‌ల‌కు సైతం అపాయిమెంట్ మెంట్ ఇవ్వ‌ని త‌త్త్వం మోడీలో ట‌న్నుల కొద్దీ ఉంటుంద‌ని చెబుతారు. అలాంటి మోడీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయి రెడ్డికి భారీ ప్ర‌యారిటీ ఇవ్వ‌టం.. కుశ‌ల ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం లాంటివి చేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉంది.పేరుకు సొంత పార్టీ నేత‌ల‌మే అయినా.. ఎప్పుడూ మోడీ నోట ప‌ల‌క‌రింపు మాట విన‌ని త‌మ‌కు భిన్నంగా.. మోడీ కంట్లో విజ‌య‌సాయి ప‌డ‌టంపై ఏపీ బీజేపీ నేత‌లు కినుకుగా ఉన్నార‌ని చెబుతారు.

అలా అని.. బ‌య‌ట‌కు ప‌డితే మ‌రింత ప్ర‌మాద‌మ‌న్న విష‌యంపై అవ‌గాహ‌న ఉండ‌టంతో.. మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌.. ద‌గ్గ‌ర‌గా ఉండే వారి ద‌గ్గ‌ర త‌మ ఆవేద‌న‌ను చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. ఇటీవ‌ల మోడీ కాళ్లకు న‌మ‌స్కారం పెట్టిన సంద‌ర్భంగా విజ‌య‌సాయి రెడ్డి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

మోడీ లాంటి నేత కాళ్ల‌కు పాదాభివందం చేయ‌టం ద్వారా.. ఆయ‌న మ‌న‌సును దోచుకోవచ్చ‌న్న విష‌యం విజ‌య‌సాయికి తెలిసిందంటే.. ఆయ‌నకు మోడీ తీరుపై ఎంతోకొంత అవ‌గాహ‌న ఉంద‌న్నది అర్థ‌మ‌వుతుంది. అంతేనా..?  కాళ్ల‌కు న‌మ‌స్కారం పెట్టిన విజ‌య‌సాయితో మోడీ కుశ‌ల ప్ర‌శ్న‌లు వేయ‌టం.. ఆయ‌న స‌మాధానం చెప్ప‌టం లాంటివి చూసిన వేళ‌.. ఒక కొత్త విష‌యం హాట్ టాపిక్ గా మారింది. మోడీ అటెన్ష‌న్ ను విజ‌య‌సాయి సొంతం చేసుకోవ‌టం వెనుక అస‌లు క‌థ వేరే ఉంద‌ని చెబుతున్నారు.

త‌న‌కు చిరాకు తెప్పిస్తున్న నిన్న‌టి మిత్రుడు చంద్ర‌బాబుకు సంబంధించి విజ‌య‌సాయి ఇస్తున్న స‌మాచార‌మే మోడీని ఆయ‌న్ను స‌న్నిహితంగా చేసింద‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును రాజ‌కీయంగా.. కేసుల ప‌రంగా ఫిక్స్ చేసేందుకు అవ‌స‌ర‌మైన స‌మాచారం విజ‌యసాయి ఇవ్వ‌టం.. దానిపై లోగుట్టుగా విచార‌ణ జ‌ర‌పాలంటూ సీబీఐకి ఇప్ప‌టికే ఆదేశాలు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు బాబు ముచ్చ‌ట్ల‌ను మోడీకి విజ‌య‌సాయి అందిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌విధంగా చెప్పాలంటే.. ఏపీకి సంబంధించి మోడీకి విజ‌య‌సాయి ఇన్ ఫార్మ‌ర్ గా మారిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకే.. విజ‌య‌సాయికి మోడీ అంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దాల్ మే కుచ్ కాలా హై? అన్న‌ది ఇప్పుడు ప‌లువురి నోట వినిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు