ట్రంప్ కూతురి హైదరాబాద్ పర్యటన చంద్రబాబు పుణ్యమేనట

ట్రంప్ కూతురి హైదరాబాద్ పర్యటన చంద్రబాబు పుణ్యమేనట

హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తమ నేత చంద్రబాబేనని పదేపదే చెప్పుకొనే టీడీపీ నేతలు ఇప్పుడు అంతకంటే పెద్ద కోతలు కోస్తున్నారు. తాజాగా వారు ఏకంగా ట్రంప్ కుమార్తె హైదరాబాద్ రాకకు చంద్రబాబుకు లింకు పెట్టేశారు. చంద్రబాబు వల్లే ఇవాంకా హైదరాబాద్ కు వస్తోందని ఊదరగొట్టడం మొదలుపెట్టారు.

నిజానికి ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇవాంక ఇండియాకు వస్తోంది.  ఈ టూర్‌లో భాగంగా ఆమె హైదరాబాద్‌లో జరిగే  ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు కూడా హాజరవుతోంది. కానీ... ఇవాంకా హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం కొత్త కథలు వినిపిస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అయితే  ఇవాంకా హైదరాబాద్‌ రావడానికి కారణం తమ అధినేత చంద్రబాబేనని ఆయన అంటున్నారు.

హైదరాబాద్‌ను చంద్రబాబు ప్రపంచ పటంలో పెట్టడం వల్లే ఇవాంకా ఈరోజు హైదరాబాద్‌ వస్తున్నారన్నది ఆయన లాజిక్. అయితే... హైదరాబాద్ అభివృద్ధి విషయంలో టీడీపీ కోతలపై సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు పడుతున్నాయి. ఇవాంకా హైదరాబాద్‌కు రావడానికి చంద్రబాబు కృషే కారణమైతే…  హైదరాబాద్‌లో డ్రగ్స్‌ బిజినెస్‌ అభివృద్ధికి, ఉగ్రవాదులు నగరంలో దాక్కోవడానికి కారణం కూడా బాబుగారే కదా అని నెటిజన్లు బాణాలు వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు