శీతాకాలం అమరావతిలోనే

శీతాకాలం అమరావతిలోనే

ఏపీ శాసనసభ ప్రస్తుత శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహించే యోచన లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. వెలగ పూడిలోని నూతన అసెంబ్లీ భవనాలు సిద్దం కావడానికి మరో రెండు నెలల సమయం పట్టనున్న నేపధ్యంలో ప్రస్తుత సమావేశాలు హైదరాబాదులోనే నిర్వహించనున్నట్లు సమాచారం. బడ్జెట్‌ సమావేశాలు అమరావతిలో నిర్వహించేందుకు డిసైడైనట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లులో ప్రతిపక్షాల సూచనల మేరకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానాలు వచ్చినప్పటికి మరోసారి అసెంబ్లీ తీర్మానాలు చేయాల్సిఉంది. ఈ క్రమంలోనే శీతాకాల సమావేశాలు తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశాలను రెండు లేదా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు. వెలగపూడిలో సచివాలయ భవనాలతో పాటు ఆరవ భవనంగా నిర్మిస్తున్న ఏపీ అసెంబ్లీ, ఏపీ శాసనమండలి భవన నిర్మాణం తుది దశకు వచ్చింది. కానీ ఇంటీరియర్‌ పనులేమి ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలతో పడింది. డిసెంబరు ఆఖరు నాటికి అసెంబ్లీ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం మరో వైపు జనవరి మొదటి వారం శీతాకాల సమావేశాలు నిర్వహించే వెసులుబాటు ఉంది. అయినప్పటికి పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తయ్యే సరికి మరో రెండు నెలల సమయం తప్పదని తెలుస్తోంది.

గత వర్షాకాల సమావేశల సమయంలోనే ఏపీ సమావేశాలు కూడా హైదరాబాద్‌లో జరగడం అదే చివరిసారి అని భావించారు. ఏపీ శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ఇక వచ్చే సమావేశాలను పూర్తిగా కొత్త రాజధానిలో నిర్వహిస్తారని భావించారు. అయితే...  స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాత్రం శీతాకాల అసెంబ్లి సమావేశాలను మాత్రం సొంత రాష్ట్రంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. నిర్దేశించిన గడువులోగా భవనాల నిర్మాణాలు పూర్తి కాని పక్షంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయంతో స్పీకర్‌ ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 15వ తేదీలోగా అసెంబ్లి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం ఆ సూచనలు అమలయ్యే పరిస్థితులు లేకపోవడంతో కెఎల్‌.యూనివర్సిటీలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దిశగా స్పీకర్‌ కసరత్తు ప్రారంభించారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు