తప్పించుకు తిరుగువాడు..

తప్పించుకు తిరుగువాడు..

లేనిపోని తంటా నేనెందుకు నెత్తికెత్తుకోవాలి? అని కాంగ్రెసు సీనియర్‌ నేత వయలార్‌ రవి ఇప్పటికి వాస్తవం తెలుసుకున్నారు. తెలంగాణ గురించి మాట్లాడి విమర్శల పాలైన ఆయనగారికి తత్వం బోధపడినట్లుంది, తెలంగాణ గురించి అడిగితే తానేమీ మాట్లాడబోనని చెప్పారు.

తెలంగాణకి సంబంధించిన ఏ అంశమూ తనకు తెలియదన్నారు వయలార్‌ రవి. ఆ విషయాలు తాను ఇప్పుడు పట్టించుకోవడంలేదని తెలిపారాయన. తెలంగాణ.. అదెక్కడుంది? అని అన్నది ఈ వయలార్‌ రవిగారే. ప్రత్యేక తెలంగాణ సమస్యకు పరిష్కారం వెతకడమంటే పెనం మీద దోసె వేసినంత తేలిక కాదనీ వయలార్‌ రవిగారే 'కోట్‌' చేశారు, చీవాట్లు తిన్నారు కూడాను తెలంగాణ వాదులనుంచి.

అధిష్టానం తెలంగాణ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే తానెందుకు తిట్లు తినాలని అసలు విషయం తెలుసుకుని ఇలా తప్పించుకు తిరుగుతున్నారు వయలార్‌ రవి. పెద్దలు చెప్పారుగా, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు