కేసీఆర్‌-బాబుకు ఇదీ తేడా

కేసీఆర్‌-బాబుకు ఇదీ తేడా

సమకాలీన రాజకీయాల్లో పోలికలు సహజం. పైగా ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్యే కాదు పాలకుల నిర?యాలు, వ్యవహారశైలిని బేరీజు వేయడం సర్వసాధారణం. ఇటీవలి కీలక పరిణామాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు దేశంలోని ముఖ్యులందరినీ ఆహ్వానించిన చంద్రబాబు అదే క్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సైతం ప్రత్యేకంగా ఆహ్వానం అందేలా ఏర్పాట్లు చేశారు. ఆహ్వానం పంపడంలో విశేషం ఏముందని అనుకోకండి. ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఆమె సహేతుకంగా వ్యవహరించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. సోనియాగాంధీని దాదాపు ఏపీలో మెజార్టీ ప్రజలు విభజన కారకురాలిగా భావిస్తుంటారు. చంద్రబాబు సైతం అనేక సందరాÄల్లోే సోనియాగాంధీ రాజకీయ అవసరాల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. అయినప్పటికీ హుందాగా వ్యవహరిస్తూ ఆహ్వానం పంపించారు. శంకుస్థాపన కార్యక్రమానికి సోనియాగాంధీ రాకపోయినా తన శుభాకాంక్షలు మాత్రం తెలిపారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వైఖరి ఆసక్తికరంగా ఉంది. డిసెంబర్‌ నెలలో అయుత చండీయాగం చేసేందుకు కేసీఆర్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినందుకు, తెలంగాణ అభివ ద్ధి కోసం ఈ యాగం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముఖ్యులందరినీ కలిసి ఆహ్వానం ఇచ్చారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులకు ఆహ్వానం ఇచ్చారు. అయితే సోనియాగాంధీని మాత్రం కార్యక్రమానికి రావాల్సిందిగా కోరలేదు!!

తెలంగాణ పోరాటంలో కేసీఆర్‌ పాత్ర ఎంత ఉందో...తెలంగాణ ఇవ్వడంలో సోనియాగాంధీ ధైర్యంతో తీసుకున్న నిర?యం వల్లే తెలంగాణ కల సాకారం అయిందన్నది అంతే ప్రాధాన్యం గల విషయం. వీటన్నింటికంటే తెలంగాణపై సోనియాగాంధీకి ప్రత్యేక అభిమానం అన్నది కూడా తెలిసిందే. అయితే తెలంగాణ పాలకుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌ సోనియాను తప్ప అందరినీ ఆహ్వానించడం గమనార్హం. ఆహ్వానం అందజేస్తే సోనియా వచ్చేవారా లేదా అన్న విషయం పక్కనపెడితే మొత్తంగా ఇద్దరు పాలకుల ఆలోచన విధానం, మర్యాద తీరు ఇదీ అని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు