పవన్‌, ఎన్టీఆర్‌ మెగా వార్‌

పవన్‌, ఎన్టీఆర్‌ మెగా వార్‌

ఈ ఆగస్టులో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన పోటీ జరగనుందని అనుకుంటున్నారు. పవన్‌ నటిస్తున్న అత్తారింటికి దారేది, ఎన్టీఆర్‌ నటించిన రామయ్యా వస్తావయ్యా అదే నెలలో, ఇంచుమించు ఒకే టైమ్‌లో రిలీజ్‌ అవుతాయని తెలిసింది. ఆల్రెడీ పవన్‌ సినిమా రిలీజ్‌ ఆగస్ట్‌ 7న అని అనౌన్స్‌ చేసేశారు.

ఒకవేళ లేట్‌ అయినా కానీ ఒక వారం రోజులు వెనక్కి వెళుతుందే తప్ప ఆగస్ట్‌ రిలీజ్‌ అయితే గ్యారెంటీ అట. అలాగే 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని వాయువేగంతో ఫినిష్‌ చేస్తున్నాడు హరీష్‌ శంకర్‌.ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు తొలి వారంలోనే రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు.ఆ వీకెండ్‌లో చాలా హాలిడేస్‌ కలిసి వస్తున్నాయని ఈ చిత్రాలకి ఆ వారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

గతంలో పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌ సినిమాల మధ్య రెండు సార్లు పోటీ జరిగింది. అయితే రెండు సార్లు హీరోలు డిజప్పాయింట్‌ చేశారు. రాఖీ, అన్నవరం వారం వ్యవధిలో రిలీజ్‌ అయి యావరేజ్‌ అనిపించుకున్నాయి. శక్తి, తీన్‌మార్‌ రెండు వారాల గ్యాప్‌తో వచ్చి డిజాస్టర్స్‌ అయ్యాయి. ఈసారి మాత్రం హీరోలిద్దరూ ఊపులో ఉన్నారు. ఈ చిత్రాలకి దర్శకులు కూడా ఉద్ధండ పిండాలు కావడంతో ఈ వార్‌ జరిగితే బాక్సాఫీస్‌ జామ్‌ అయిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు