వైకుంఠపురానికి దూరంగా దిల్‌ రాజు!

వైకుంఠపురానికి దూరంగా దిల్‌ రాజు!

సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలకీ దిల్‌ రాజు డిస్ట్రిబ్యూటర్‌ మాత్రమే. గౌరవ సూచకంగా 'సరిలేరు నీకెవ్వరు'కి దిల్‌ రాజు పేరుని సమర్పకునిగా వేసారు కానీ అందులో అతను పెట్టిన పెట్టుబడి లేదు. లాభాల్లో వాటా కూడా రాదు. అయితే తాను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఏ సినిమా సక్సెస్‌ని అయినా ఓన్‌ చేసుకుని ఆ చిత్రం సక్సెస్‌ మీట్‌లో పాల్గొనే దిల్‌ రాజు 'అల వైకుంఠపురములో' చిత్రం విజయోత్సవాలలో కనిపించడం లేదు.

ఈ విజయోత్సవాలకి వెళ్లినట్టయితే సదరు సినిమా సాధిస్తోన్న నంబర్ల గురించి దిల్‌ రాజు ప్రస్తావించాల్సి వస్తుందని, అది మహేష్‌బాబుని బాధించే అవకాశం వుందని కావాలనే దిల్‌ రాజు 'అల వైకుంఠపురానికి' దూరంగా వుంటున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్ర బృందమే దిల్‌ రాజుని ఇరుకున పెట్టడం ఇష్టం లేక తమ సక్సెస్‌ సభలకి ఆహ్వానించడం లేదని కూడా అంటున్నారు.

ఇందులో ఏది నిజమనేది తెలియదు కానీ అల వైకుంఠపురములో పంపిణీదారునిగా దిల్‌ రాజు భారీ లాభాలనే చవిచూస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు కూడా తనకి ప్రాఫిటబుల్‌ వెంఛరే కావడంతో ఈ సంక్రాంతికి రాజు తన బ్యానర్‌నుంచి సినిమా లేకపోయినా కానీ పరమానందంగానే వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English